ప్రధాని మోదీ ప్రశంసలు పొందిన అనంతపురం మహిళ ఆదర్శ రైతు

  • ప్రభుత్వం పంపిణీ చేసిన బంజరు భూమిలో బంగారు పంటలు
  • నాలుగు ఎకరాల బంజరు భూమిలో పంటల సాగు
  • ప్రధాన్‌ సమ్మాన్‌ నిధి 8వ విడతలో ఏపీకి రూ.943 కోట్లు

  అనంతపురం జిల్లా ,కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన వన్నూరమ్మ సంకల్పం చాల గొప్పది. ప్రభుత్వం ఈ మహిళకు నాలుగు ఎకరాల బంజరు భూమిని ఇచ్చింది. కానీ పంట సాగు ఆ ప్రాంతంలో చుక్కానీరు లేదు.ఇక్కడ వర్షపాతం కూడ చాల తక్కువగా వుంటుంది. అలాంటి భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చుకొని పచ్చని పంటలను సాగు చేస్తూ అందరికి స్పూర్తిగా నిలుస్తోంది. అందులో రెండెకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తోంది. మరో ఎకరాలో నవధాన్యాలు, వేరుశనగ, కూరగాయలను మూడు పంటలను సాగు చేస్తోంది.వీటన్నింటికీ పెట్టుబడి రూ.27 వేలు కాగా, ఎకరాకు రూ.1.07 లక్షల లాభం వచ్చింది. ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉండటంతో వన్నూరమ్మ ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమిని అభివృద్ధి చేసుకుంది. తన చుట్టు పక్కన వున్న తండా మహిళలకు ఈ వ్యవసాయ విధానంలో మెళకువలను నేర్పిస్తుంది.

  ప్రధాని మోదీ ప్రశంసలు..

  ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న వివిధ రాష్ట్రాల రైతులతో ప్రధాని మాట్లాడారు.8వ విడత ‘రైతు సమ్మాన్‌ నిధి’ విడుదల కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్న రైతుల్ని ప్రశంసించారు. వర్చువల్ పధ్థతిలో ఆన్ లైన్ లో రైతులతో సమావేశమయ్యారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా మహిళ రైతు వన్నూరమ్మ ఆత్మివిశ్వాసాన్ని కొనియాడారు. బంజరు భూమిలో పంట సాగు ఎలా సాధ్యం అయ్యిందని మోదీ రైతును అడిగి తెలుసుకున్నారు. తానే చేయటమే కాకుండా తన తోటి 170 మంది గిరిజన మహిళలకు తాను చేస్తున్న విధానాన్ని తెలియచేస్తూ అందరని ప్రోత్సాహిస్తునందుకు ప్రధానీ అభినందనలు తెలిపారు.

  ప్రధాన మంత్రి తో మాట్లాడిన మహిళా రైతు వన్నూరమ్మను జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ప్రత్యేకంగా అభినందించారు. పీఎం కిసాన్‌ ప్రారంభ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్‌ చాంబర్లో మహిళా రైతుతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఒంటరి దళిత మహిళా రైతు ప్రకృతి వ్యవసాయం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మహిళా రైతు వన్నూరమ్మను ఆదర్శంగా తీసుకుంటే జిల్లా అంతా పచ్చగా మారుతుందన్నారు. ఆత్మ్థసర్యం, మీ మీద మీకు నమ్మకం ఇదే మిమ్మల్ని కాపాడిందని, ఇది చాలా అద్భుతమని, భర్త చనిపోయినా ఒంటరి మహిళ వన్నూరమ్మ నలుగురు పిల్లలతో ఇలా కష్టపడి పైకి రావడం చాలా గొప్ప విషయమన్నారు. కష్టపడే వారిలో ఆత్మ్థసర్యం ఉంటు-ందని, ఎలాంటి బెణుకు లేకుండా చకచకా మాట్లాడటం చూస్తే మీ కష్టం అందులో కనబడుతోందన్నారు. ఇలాంటి మహిళలు దేశానికే ఆదర్శం అని, మీరు ఇతరులకు సహాయం చేస్తుండటం చాలా గొప్ప విషయమన్నారు.

  ఏపీకి రూ.943 కోట్లు
  ప్రధాన్‌ సమ్మాన్‌ నిధి 8వ విడతలో ఆంధ్రప్రదేశ్‌లోని 43,01,882 మంది రైతులకు రూ.943,78,54,000, తెలంగాణలోని 35,42,673 మంది రైతులకు రూ.724,43,20,000 దక్కింది. దేశవ్యాప్తంగా ఈ ఫలితం పొందిన 9.50 కోట్ల మంది రైతుల్లో ఏపీ రైతులు 4.52%, తెలంగాణ రైతులు 3.72% మంది కాగా, అందరికీ కలిపి విడుదల చేసిన రూ.20,667 కోట్లలో ఏపీ రైతులకు 4.56%, తెలంగాణ రైతులకు 3.50% మొత్తం దక్కింది.