ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు

పాఠశాలల్లో బోధన పద్దతుల్లోనూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. బ్లాక్ బోర్డుల ద్వారా పాఠాలు చెప్పే ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించింది. ప్రొజెక్టర్ల ద్వారా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో విద్యా బోధన చేస్తోంది . ప్రతి పాఠశాలకు నిరంతర విద్యుత్ ను అందించి డిజిటల్ విధానం ద్వారా విద్యా బోధన, కంప్యూటర్ విద్యా శిక్షణను ప్రారంభించింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరకు బయోమెట్రిక్ విధానంను తీసుకువచ్చింది. పాఠశాల దశలోనే విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంది. మొదటి పైలెట్ ప్రాజెక్ట్ కింద కొన్ని పాఠశాలలను ఎంపిక చేసింది. తర్వాత దశల వారిగా అన్ని పాఠశాలలో డిజిటల్ విద్యా విధానంలో చదువును అందించేందుకు ప్రణాళికలు రచించింది.

తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న సమయంలో ఇన్ని సౌకర్యాలు లేవని.. కానీ ఇప్పుడు తమ పిల్లలకు కార్పోరేట్ స్కూల్స్ ని మించిన సౌకర్యాలు కల్పించారని శివయ్య ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం ఎంత కష్ట పడ్డ పిల్లల భవిష్యత్త్ కోసమేనని.. ఆ కష్టాన్ని తగ్గించి ఒక మేన మామగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మా పిల్లల గురించి పధకాలు తీసుకురావటం ఏపీ విద్యార్థుల్లో కొత్త మార్పుకు నాంది పలుకుతుందని అంటున్నారు.

శివయ్య ,మేస్త్రీ


మాకు ఇద్దరు అమ్మాయిలు.. ఇద్దరిని తమ స్తోమతకు మించి ప్రైవేటు పాఠశాలలో చదివించాం. ఫీజులు కట్టేందుకు అప్పులు చేయాల్సి వచ్చింది. కరోనా కారణంగా పొలం పనులేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. తీసుకున్న అప్పులు కట్టలేక పిల్లలను బడి మాన్పించాలనుకున్నాం. కానీ అలాంటి సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి  నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్థాయిలో తీర్చిదిద్దాడు. అమ్మఒడి ద్వారా ఇద్దరి పిల్లలకు చెరో 15 వేల చొప్పున 30 వేల తన ఖాతాలో జమ చేశారు. మా పిల్లల భవిష్యత్ కు బంగారు బాట వేసిన జగనన్నకు మేం ఎప్పుడు రుణపడి ఉంటాం.

రమణమ్మ, వ్యవసాయ కూలీ


నాకు ముగ్గురు పిల్లలు వారిని స్కూల్ కు పంపించాలంటే అష్టకష్టాలు పడేవాడిని . గత ఏడాది ప్రారంభించిన అమ్మ ఒడి పథకం కింద ఇద్దరు పిల్లలకు చెరో పదిహేను వేల చొప్పున 30 వేల రూపాయలు మా భార్య ఖాతాలో డబ్బులు పడ్డాయి. మిగిలిన ఒక్కడికి కూడా అమ్మ ఒడి పథకం వర్తిస్తే బాగుండేది. కానీ జగనన్న గోరు ముద్ద పేరుతో మా ముగ్గురు పిల్లలు ఒకపూట కడుపునిండా తింటున్నారని… స్కూలుకు వెళ్ళేందుకు బ్యాగ్ లు, యూనిఫాం, పుస్తకాలు, షూ, టై కూడా ఇచ్చారని వెంకటేషం అనందం వ్యక్తం చేస్తున్నారు.

వెంకటేషం, ప్రైవేటు ఉద్యోగి


తమ కుమారుడు  అంజయ్య గత ఏడాది అంతుచిక్కని రోగంతో చనిపోయారు. దీంతో మా కోడలు శారద ఒక్కతే కష్టపడుతూ కూలీకి వెళ్ళి ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. మొదటి వాడు రాజు 6 తరగతి చదువుతున్నాడు. మరో బాబు శ్రీను ఐదో తరగతి చదువుతున్నాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న నా కుమారుడు చనిపోవడంతో మనవళ్ళను  చదివించాలంటే ఏం చేయాలో అర్థం కాలేదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  కొడుకు రూపంలో మా  కుటుంబానికి అండగా ఉన్నాడు. దీంతో పాటు అమ్మ ఒడి పథకం ద్వారా ఇద్దరికి 30 వేల రూపాయలు ఖాతాలో పడుతూ.. పిల్లల చదువు సాఫీగా సాగుతోంది.

సుబ్బయ్య, వృద్దుడు

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న పలు సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. 12 వేల కోట్లు వ్యయంతో మొదటి దశలో 15 వేల పాఠశాలలో మౌళిక సదుపాయలు కల్పిస్తున్నారు.