ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా పెరుగుతున్న విద్యార్థుల చేరికలు

నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పాఠశాలలను ఆధునీకరణించడంతో విద్యార్ధులకు వారి తల్లితండ్రులకు ప్రభుత్వ పాఠశాల విద్యా బోధనపై ఆసక్తి పెరిగింది. కార్పోరేట్ స్థాయిలో అన్ని హంగులతో ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించటంతో పాటు అమ్మఒడి, జగనన్న విద్యా కానుక లాంటి పధకాలను ప్రభుత్వం ప్రవేశ పెడుతుంది. అత్యాధునికంగా మినరల్ వాటర్ ఫ్లాంట్ లను ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయులను పోస్టులు భర్తీ చేయడం తదితర కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొత్త విద్యార్థుల చేరిక భారీగా పెరిగింది. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా దెబ్బతిన్న పేద , మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు .

ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో  అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్నిజగనన్న గోరుముద్ద పథకంగా మార్చింది. విద్యార్థులకు మంచి పౌష్ఘికాహారం అందించేలా మెనూలో మార్పులు తీసుకువచ్చింది. తాజాగా జగనన్న విద్యా కానుక పేరుతో  విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందించే మరో కొత్త కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం వంటివి ఉచితంగా అందిస్తోంది. దీంతో పాటు స్కూల్ బ్యాగ్ ,మూడు జతల యూనిఫాం క్లాత్ , బెల్టు , బూట్లు, సాక్సులు, పుస్తకాలు, నోటు పుస్తకాలు కలిపి కిట్ గా అందించింది. ఈ పథకం కోసం ప్రభుత్వం  655 కోట్లు రూపాయలు  ఖర్చు చేసింది. ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందు పలు మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

జగనన్న విద్య కానుక కింద మా పిల్లలకు స్కూల్ యూనిఫాం , పుస్తకాలు , షూ ,టైతో కూడిన కిట్ తో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిచటంతో గంతలో కంటే ఇప్పుడు మరింత ఇష్టంగా మా బాబు ప్రతి రోజు క్రమం తప్పకుండా స్కూల్ కు వెళ్ళున్నాడని రాజమ్మ అంటున్నారు.

-రాజమ్మ ,కూలీ

మాకు ముగ్గురు పిల్లలు.. ఆ ముగ్గురిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాం. అందులో ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగ్గా చదువు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది మా పిల్లలందరికి జగనన్న విద్యా కానుకలు అందాయని ఆనందం వ్యక్తం చేశారు.చదువు కోవటం ఇంత సులువవుతుందని ఎప్పుడూ ఊహించలేదని.. తన పిల్లల్ని ఉన్నత స్థాయిలో చదివించే తన కల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల నెరవేరుతుందని చాల గర్వంగా చెబుతున్నారు.

గోవిందు,రైతు