హస్తకళలకు ప్రోత్సాహంగా ఆర్ట్ విలేజ్

    విశాఖకు సమీపంలో వున్న ఈ ప్రాంతానికి వెళితే ఒక్క సారీగా పల్లె వాతావరణాన్ని తలపిస్తుంది. ఒకవైపు చరఖా, మగ్గాల సవ్వడీ, మరోవైపు చెక్కబొమ్మల తయారీ, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు, కుటీర పరిశ్రమలు, హస్తకళల్లో మునిగిపోయే కళాకారులు, పాడి పంటలతో అలరారే గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది. నూతన ఆలోచనలతో నిర్వహణ చేస్తున్న సంకల్ప్ ఆర్ట్స్ విలేజ్ చూస్తే ఎంతో మంది యువకులకు స్పూర్తిగా నిలుస్తోంది.