మహిళలకు ఉపాధిగా ప్రాసెసింగ్ యూనిట్లు

మార్కెట్ లో ఎన్ని రకాల కూరగాయాలున్నా.. అందులో ఉల్లిపాయ, టమాటా ధరలు మాత్రం స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ లా అతి వేగంగా మారిపోతుంటాయి. మార్కెట్ లో ఓ సారీ 10 రూపాయలకు కిలో వుంటే.. మరో సారీ ఏకంగా వందకు దాటి పోతుంది. కానీ ఇవి మన భారతీయ వంటల్లో ప్రతి ఒక్కరూ వినియోగించే కూరగాయలు. ఇదిలా వుంటే ఈ పంటలను సాగు చేస్తున్న రైతులకు ఎప్పుడు ధరలు తగ్గిపోతాయోనన్న భయం. ఇలాంటి పరిస్థితి నుండి బయటకు రావటానికి ఏ సీజన్‌లో అయినా సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉండేలా.. తిరుపతి చెందిన ప్రమీలకు ఒక మంచి ఐడియా వచ్చింది.

చిత్తూరు జిల్లాలో ఎక్కువగా సాగు చేసే టమాటా పంటకు సరైన మార్కెట్ లేక నష్టపోతున్న రైతులను చూసి చలించింది. ఈ సమస్యకు పరిష్కారం చూపేలా గ్రామీణ మహిళల సాధికారతగా చిత్తూరు జిల్లాలో టమాటో నిల్వ చేసే ప్రాజెక్టును రూపొందించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ మహిళా సాధికారత మిషన్ ద్వారా టమాటా, ఉల్లి, ఆలు గడ్డల్లోని నీటిశాతాన్ని ఆధునిక సాంకేతిక యంత్రాలతో తీసి, అందులో వున్న పోషక విలువలు కాపాడుకుంటూ నిల్వ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు జిల్లా గ్రామీణ మహిళలలకు ప్రయోజనం కలిగేలా డ్రై టమాటా,ఉల్లి, ఆలు తయారీలో శిక్షణ ఇస్తున్నారు.వారు టమాటాలు తెచ్చుకొని పైసా ఖర్చు లేకుండా అక్కడి మిషనరీని ఉపయోగించి డ్రై చేసిన ఉత్పత్తులను మార్కెట్‌ చేసుకోవచ్చు. దీని వల్ల ప్రతీ మహిళకు ఆర్ధికంగా ఎదిగే అవకాశం కలుగుతుంది.

మహిళలకు ఆర్ధికంగా ఎదగడానికి, రైతులకు పంట నష్టాలను నివారించి గ్రామీణ ఆర్ధిక స్వరూపాన్ని మార్చే ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో తొలసారిగా మొదలైంది. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృధ్ది శిశు సంక్షేమ శాఖ ప్రోత్సాహాంతో ఈ ప్రాజెక్టు వల్ల మార్కెట్ లో తమ బ్రాండ్ కి మంచి ప్రచారం పెంచుకుంటూ దేశ వ్యాప్తంగా ఉత్పత్తులను విస్తృతపరిచే ప్రక్రియలో వున్నామని ప్రమీల తెలిపారు.

తయారు చేస్తున్న ఉత్పత్తులు
టమాటా, ఉల్లి, ఆలుగడ్డ పంటల సాగులో వచ్చిన వీటిని టమాటో కెచప్ , మిక్సిడ్ ప్రూట్ జూమ్ లాంటి పలు రకాల ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ లో అమ్ముతున్నారు. ఇందు కోసం ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలతో వీటిని రూపొందిస్తున్నారు.