వైయస్ఆర్ రైతు భరోసాగా ప్రభుత్వం పెట్టుబడి ఖర్చులు అందించటంతో పాటు అదే రైతుకు అనుకోని పరిస్థితిల్లో ప్రకృతి విపత్తు వల్ల నష్టం జరిగినా పంట కోసం రుణాలు కావాలన్నా, రైతులకు అండగా నిలబడుతోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. పంటల సాగు కోసం రుణం తీసుకున్న రైతులకు వడ్డీ భారం తప్పించాలనే లక్ష్యంతో జగన్ అధికారంలోకి రాగానే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ప్రకటించారు.
ఇందులో భాగంగానే గత ఏడాది ఖరీఫ్ లో బ్యాంకుల నుంచి లక్ష లోపు పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులందరికీ ప్రభుత్వం వడ్డీ రాయితీ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. గత ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన వడ్డీ రాయితీని కూడా ప్రస్తుత ప్రభుత్వం అందిస్తోంది.
ఈ-క్రాప్ డేటా ఆధారంగా రైతులకు సకాలంలో పంట రుణాలు ఇప్పించడం, నిర్ణీత వ్యవధిలో అప్పులు తీర్చేలా ప్రోత్సహించడం ద్వారా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి అర్హులైన రైతులందరూ లబ్ధిపొందేలా జగన్ మోహాన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. ఈ పధకం ద్వారా లబ్ధిదారులైన జాబితాలను పారదర్శకంగా వుండేలా రైతు భరోసా కేంద్రాల దగ్గర సామాజిక తనిఖీ కోసం ప్రదర్శిస్తున్నారు. ఇక దురదృష్టవశాత్తు విపత్తుల వల్ల పంటకు నష్టం వాటిల్లితే బాధిత రైతులకు అదే సీజన్లో పెట్టుబడి రాయితీ చెల్లిస్తూ, వచ్చే సీజన్లో పంటలు వేసుకునేందుకు బాసటగా నిలవాలన్నది సీఎం జగన్ మోహాన్ రెడ్డి ఆశయం. ఇందులో భాగంగానే రైతుల ఖాతాల్లో పెట్టుబడి రాయితీ జమ చేశారు.