మహిళల ఆర్థిక అభివృధ్దిలో సున్నావడ్డీ పధకం

స్వయం సహాయక సంఘాల మహిళల కోసం వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏపీ ప్రభుత్వం. సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8లక్షల 78 వేల పొదుపు సంఘాల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పావలా వడ్డీ పథకం ప్రారంభమైంది. తర్వాత అది సున్నా వడ్డీ పథకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల్లోని 93 లక్షల మంది ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తోంది. దీనిద్వారా పొదుపు సంఘాల మహిళలకు రూ.1,400 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది.

            కరోనా వచ్చి జీవితాలను అతలాకుతలం చేసింది. బతుకు చిత్రమే కాదు.. చేస్తున్న పని.. పెట్టుకున్న ఆశలు.. అన్నీ ఆగిపోయాయి. ఇలాంటి సమయంలో మహిళలకు అండగా నిలిచేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడో ఆగిపోయిన పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చి కరోనా కష్టకాలంతో ప్రతీ ఒక్కరికి అండగా నిలిచారు. కోవిడ్ ప్రభావంతో చిదిమేసిన జీవితాలు.. సున్నా వడ్డీ రుణాలతో మళ్లీ గాడిలో పడుతున్నాయి. బతుకినిచ్చేవాడు దేవుడైతే.. ఆ బతుకును మార్చేవాడు దేవునికన్నా గొప్పవాడు అంటూ ముఖ్యమంత్రి జగన్‌కు మహిళలు నీరాజనం పలుకుతున్నారు.


దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వడ్డీ భారం తగ్గించడానికి తన పాలనలో పావలా వడ్డీ ప్రారంభించారు. దురదృష్టం కొద్దీ ఆయన్ని కోల్పోయాం. కానీ ఆ తరువాత వచ్చిన ప్రభుత్వంలో జీరో వడ్డీ లేదు, రుణమాఫీ లేదు.పాదయాత్రలో మీరు మా కష్ట సుఖాలను తెలుసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా మా అభ్యున్నతి కోసం సున్నా వడ్డీ పథకం తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది.
– ఖాజా మున్నీసా, నురానీ పొదుపు సంఘం సభ్యురాలు, ఓర్వకల్లు, కర్నూలు జిల్లా


కరోనా సమయంలో ఆదుకుంన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రానికి మీ మార్గనిర్దేశం కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరు ఆయు రారోగ్యాలతో చల్లగా ఉండాలని మహిళలు కోరుకుంటుూ ఆశ్వీరదిస్తున్నారు.
– రమణమ్మ, నెల్లూరు మండల సమాఖ్య ఉపాధ్యక్షురాలు
అనంతపురం జిల్లా గుత్తిలో సోప్‌ సొల్యూషన్స్‌ను విక్రయిస్తున్న డ్వాక్రా మహిళలు


అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంది. వాలంటీర్లు చాలా సేవ చేస్తున్నారు. వెయ్యి రూపాయలు, మూడుసార్లు రేషన్‌ ఇవ్వడం చాలా మంచి నిర్ణయాలు. మహిళలకు ఉపాధి కల్పించడం పట్ల సంతోషిస్తున్నాం. అరటి లాంటి ఉత్పత్తులను మహిళా సంఘాల ద్వారా అమ్మకాలు చేయిస్తున్నారు. తద్వారా కూడా ఉపాధి పొందుతున్నాం.

– ఆర్‌.లక్ష్మి, ప్రగతి సంఘం అధ్యక్షురాలు, కరవది, ప్రకాశం జిల్లా


మాది లక్ష్మీ తిరుపతమ్మ స్వయం సహాయక సంఘం. ఎన్నికల తేదీ నాటికి రూ.8 లక్షల అప్పు ఉంది. అంతకు ముందు సున్నా వడ్డీ రాయితీ లేకపోవడం వల్ల రూ.75 వేలకు పైగా వడ్డీ చెల్లించాం. ప్రస్తుతం జగన్‌ ప్రారంభించిన సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపు రూ.80 వేలు వడ్డీ మా ఖాతాల్లో జమ అయింది. ఇన్ని ఇబ్బందుల్లో వడ్డీ సొమ్ము ఇస్తారని మేము అసలు ఊహించ లేదు. ముఖ్యమంత్రికి రుణ పడి ఉంటాం.
–ఎస్‌.వెంకట శివకుమారి, కృష్ణా జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు

సున్నా వడ్డీ పధకాన్ని వినియోగించుకొని తనతో పాటు తన తోటి స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక మెరుగుదలలో ప్రోత్సాహం లభించిందంటూ స్వయం సహాయక బృంద సభ్యురాలు శోభాబాయి ఆనందాలు పంచుకుంటున్నారు.

శోభాబాయి, స్వయం సహాయక బృంద సభ్యురాలు, కడప జిల్లా