మహిళల ఆరోగ్య, భధ్రతకు పెద్ద పీట

మహిళల భద్రత, ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర  మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత అన్నారు.  ఆర్ధిక భారం అయినా లెక్క చేయకుండా నిధులను కేటాయిస్తోందని  పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ. 500 కోట్లను కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం రూ. 1800 కోట్ల రూపాయలను కేటాయించి మహిళల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుందన్నారు. శుక్రవారం ఐ.సి.డి.ఎస్ సి.డి.పి.ఓ లు, సూపర్ వైజర్లతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా.. అంగన్వాడి కేంద్రాలను రెగ్యులర్ గా తనిఖీలు తనిఖీలు చేయాలనీ ఆదేశించారు. నాణ్యమైన సరుకులు రానపుడు డెలివరీ తీసుకోకుండా తిరిగి పంపించి వేయాలని అన్నారు.

స్టాక్ వచ్చేటప్పుడే వెరిఫికేషన్ చేసుకోవాలని, నాణ్యత లేని వాటిని సరఫరా చేసిన వారికి నోటీసు లు జారి చేయాలనీ సూచించారు. తరచుగా అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేస్తుంటేనే అక్కడి లోపాలు అధికారుల దృష్టికి వస్తాయని, లోపాలను సవరించుకుంటే  గ్రామాల్లో మెరుగైన సేవలు అందించగలమని అన్నారు. ఈ తనిఖీలతో అంగన్వాడీ కేంద్రాల్లో బోగస్ నమోదును కూడా తగ్గించవచ్చని అన్నారు. ఒక తనిఖీకి మరొకసారి వెళ్లి చేసిన తనిఖీ కి మధ్య జరిగిన మార్పులను కూడా గుర్తించాలన్నారు.  ప్రభుత్వం గర్భిణీల, బాలింతల, పసి పిల్లల ఆరోగ్యానికి కేటాయిస్తున్న నిధులు వృద్ధా కాకుండా లబ్ది దారులకు అందిన నాడే ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రంలో క్లిష్హ్త మైన ఆర్ధిక పరిస్థితి ఉన్నప్పటికీ సంక్షేమ పధకాలను అమలుచేస్తున్న ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటీ మీరంతా చిత్త శుద్ధితో పని చేయాలనీ హితవు పలికారు.

Source: https://www.prabhanews.com/apnews/minister-taneti-vanitha-review-meeting/