మెగా రిటైల్ టెక్ట్స్​టైల్‌ పార్క్‌కు స్పెషల్ ప్యాకేజీ

    తాడేపల్లిలో క్యాపిటల్ బిజినెస్ పార్క్ సంస్థకు మెగా రిటైల్ టెక్ట్స్​టైల్‌ పార్క్‌కు స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 900 టెక్ట్స్​టైల్‌ ఔట్ లెట్లను 7 లక్షల చదరపు అడుగులలో ఏర్పాటు చేయనున్నారు. అలాగే అమ్మయ్యప్పర్ టెక్ట్స్​టైల్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు కూడా స్పెషల్ ప్యాకేజి ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం ఎలక టూర్ లో గ్రీన్ ఫీల్డ్ గార్మెంట్స్ మ్యానుఫాక్చరింగ్ ఏర్పాటు చేయనున్నది. వాల్యూ యాడెడ్ ఎంబ్రాయిడరీ యూనిట్లను కూడా ఏర్పాటు చేయనున్నది.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ap-government-grants-special-package-textile-parks-1379136