యోగి వేమన విశ్వవిద్యాలయంతో ప్రెస్ అకాడమీ ఒప్పందం

యోగి వేమన విశ్వవిద్యాలయంతో ప్రెస్ అకాడమీ ఒప్పందం

రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రెస్ అకాడమీ వివిధ విశ్వవిద్యాలయాలతో కలిసి సంయుక్తంగా పని చేయాలని, నిర్ణయించినట్లు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. వివిధ విశ్వవిద్యాలయాల్లోని జర్నలిజం శాఖలో అడ్మిషన్ తీసుకున్న జర్నలిస్టులకు ఫీజు రాయితీ కల్పిస్తామని, అందులో భాగంగా కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు చెప్పారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, విశ్వవిద్యాలయాల్లో ఆ మేరకు సిలబస్ లో మార్పులు చేయాలని కోరారు. జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించే ఏర్పాట్లు కూడా చేస్తామని తెలిపారు. వివిధ విశ్వవిద్యాలయాల సమన్వయంతో సదస్సులు, వర్కుషాపులు నిర్వహించేందుకు కూడా సమాయత్తమవుతున్నామని వివరించారు.

ప్రభుత్వ పథకాలు, వివిధ కార్యక్రమాల్ని ఆయా వర్గాలకు చేర్చడానికి యూనివర్సిటీలతో కలిసి పని చేయాలని భావిస్తున్నామని వివరించారు. ఒప్పంద కుదుర్చుకున్న పత్రాల్లో ఆ యూనివర్సిటీ రిజిస్ట్రారు ప్రెస్ అకాడమి కార్యదర్శి ఎం.బాలగంగాధర్ తిలక్ సంతకాలు చేసి చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ సమక్షంలో పరస్పర ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు