రాష్ట్రంలో 16 హెల్త్ హబ్స్ ఏర్పాటు

    రాష్ట్రంలో భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సంక్షోభం ఎదుర్కొనేలా రాష్ట్రంలో 16 హెల్త్ హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాుప్తంగా 16 హెల్త్ హబ్స్ లను ఎక్కడికక్కడ నాణ్యమైన వైద్యం అందించాలని -సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకుంటూ అధికారులను ఆదేశించారు.


    ఇక భవిష్యత్తులో ఎక్కడికక్కడే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడంతో పాటు… వ్యయ,ప్రయాసలతో హైదరాబాద్,బెంగళూరు లాంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన భారం వుండదు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోనున్నారు. రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు… తాజా సమీక్ష సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రజలు వైద్యం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి నగరాలకు వెళ్ళాల్సిన పరిస్థితులపై ఆలోచించాలి. ప్రజలకు అత్యాధునిక వైద్యం అందించేలా ఆసుపత్రులను విజయవాడ, తిరుపతి, రాజమండ్రి సహా 16 చోట్ల హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అన్నారు. ఇందుకోసం ఒక్కోచోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. మూడేళ్ల కాల వ్యవన్ధలో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే ఆస్పత్రులకు ఆ భూములు ఇవ్వాలని సూచించారు.

    జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు , కార్పోరేషన్లలో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయన్నారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. కనీసం 80కి పైగా మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు రాష్ట్రంలో అందుబాటులోకి వస్తాయన్నారు. టెరిషరీ కేర్‌ మెరుగు పడితే ఇతర ప్రాంతాల్లో వైద్యానికి పరుగులు పెట్టే అవసరం ఉండదన్నారు. అలాగే ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ పథకంతో మరింత నాణ్యమైన వైద్య సేవలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పొందవచ్చునన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వ్యాక్సిన్ తయారయ్యే పాలసీని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో అంబులెన్సుల రాకపోకలపై వివాదం తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో ఏపీ ప్రజలు వైద్యం కోసం ఇతర రాష్ట్రాల్లోని నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సీఎం జగన్ హెల్త్ హబ్‌ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.