రైతుకు ధీమాగా.. ఉచిత పంటల బీమా

రైతు పంట సాగు దగ్గర నుండి పంట చేతికొచ్చే వరకు ఎన్నో ఒడిదొడిగులు ఎదుర్కొంటారు. ఇక తీర పంట ఇంట్లోకి వస్తుందన్న సమయానికి అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి కోల్పోయి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందు కోసం రైతులకు ధీమా కల్పించే వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 2019 సీజన్‌లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు దాదాపు రూ.1,252 కోట్ల బీమా పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అంతే కాదు ప్రభుత్వమే రైతుల తరుపున ప్రీమియం చెల్లించి రైతుల ఖాతాలకు ఉచిత పంటల బీమా పరిహారం అందిస్తోంది. 2019 సీజన్‌లో పంట నష్టానికి ఏడాది తిరగకముందే బీమా పరిహారాన్ని రైతుల ఖాతాలకు జమ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.

వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేస్తూ బీమా సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించే ఏర్పాటు చేసింది. రైతులు స్వయంగా పరిశీలించుకునేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాల్లో ఈ–క్రాప్‌ వివరాలతో సహా లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించారు. 2019–20లో 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు పంటల బీమాను వర్తింప చేసింది. ఇందుకోసం రైతులు చెల్లించాల్సిన రూ.468 కోట్ల ప్రీమియంను కూడా ప్రభుత్వమే భరిస్తూ మొత్తం రూ.971.23 కోట్లు చెల్లించింది.