రైతు బజార్లలో కొత్త దుకాణాలు

రైతు బజార్లకు ఎక్కువ మంది వినియోగదారులు వచ్చేలా వాటిలోనే ప్రతి చోటా బేకరీలు, ఏటీఎం, జనరిక్‌ మెడిసిన్, బియ్యం దుకాణాలు వంటివి ఏర్పాటు చేసేందుకు అదనపు షాపులు నిర్మించాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. మార్కెటింగ్‌ శాఖాధిపతులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. రైతు బజార్లలో దీర్ఘకాలంగా అద్దెలను పెంచని షాపులకు రైతులపై భారం పడకుండా హేతుబద్ధంగా అద్దెలు పెంచుకోవడంతో పాటు.. రైతు బజార్లలో బినామీ వ్యాపారుల తొలగింపునకు చర్యలు చేపట్టాలన్నారు.