రైతులకు ఇక పండగే

రైతు కష్టం తీర్చడం కాదు… కష్టం రాకుండా చేసే మంచి మనసు వుండాలి. కష్టమైన పనిలోనే ఆనందం వెతుక్కునే శ్రమజీవి రైతన్న. అలాంటి అన్నదత చేతుల్లో పెట్టుబడి లేక.. చిల్లిగవ్వ దొరికే పరిస్థితులు కనిపించక.. రైతన్న మౌనంగా రోదించిన రోజులు ఎన్నో ! వీరీ ఎన్నో కష్టాలను తన పాదయాత్రలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి చూశారు. పడిన ప్రతీ అడుగులో అన్నదాతకు ఏదో చేయాలన్న ఆలోచనే కనిపించింది. అధికారంలోకి వచ్చాక ఆయన పనులు చూస్తే అదే అనిపించింది. రైతుకు ఎక్కడా కష్టం కనిపించొద్దు.. అన్నట్లుగా వరుస పథకాలు ప్రవేశపెడుతున్నారు. అన్నం పెట్టే రైతన్న కళ్లలో ఆనందాన్ని చూస్తూ.. అసలైన ఆనందం ఇదే కదా అన్నట్లుగా సంతోష పడుతున్నారు.

వ్యవసాయం దండగ అన్న నోళ్లే.. ఇప్పుడు పండగ అంటున్నాయ్. పట్నంలో ఇరుకు వీధుల్లో.. చాలీచాలని జీవితాలను ఈడ్చుకొచ్చిన బతుకులు మారాయి. జన్మనిచ్చిన ఊరుకు బతుకు నేర్చుకునేందుకు వెళ్లేలా చేస్తున్నాయి. అవును.. ఎవరో రైతన్న అన్నట్లు ఈ ఐదేళ్లు జగనన్న నామ సంవత్సరాలే ! లాభాల సంగతి దేవుడెరుగు.. పెట్టిన ఖర్చు తిరిగి వస్తుందో రాదో.. భూమిని నమ్ముకొని తప్పు చేస్తున్నామా.. అనుకున్న రైతులకు సీఎం జగన్ మోహాన్ రెడ్డి భరోసాగా నిలిచారు. సాగు మరింత పుష్కలం చేశారు. పెట్టుబడి బాధ్యత మాది అంటూ ప్రతీ రైతన్న ఇంటి పెద్ద కొడుకయ్యారు.

రామచంద్రయ్య, పశ్చిమ గోదావరి జిల్లా రైతు

వర్షకాలానికి, శీతాకాలానికి మధ్య సమయం ఓ రైతుకు ఎంతో కఠినం ! ఈశాన్య రుతుపవనాలు వీచే సమయం ఇది. ప్రతీసారి పలకరించే తుఫాన్లు ప్రకృతి ప్రకోపాలు.. రైతన్నకు నిద్రలేని రాత్రులు మిగిల్చేవి. చేతికొచ్చిన పంట నీట మునిగి.. తడిసిన పంటలను చేతుల్లో పట్టుకొని మౌనంగా మనసులో కన్నీరు పెట్టుకున్న రైతులు ఎందరో ! ఆరుగాలం శ్రమించిన కష్టం… పెట్టుబడి అంతా పోయేది. నష్టం లెక్కలు అంటూ అధికారులు లెక్కలేసుకెళ్లినా.. చేతికొచ్చే సాయం ఎప్పుడో ! జగన్ సీఎం అయ్యాక అంతా మారింది పరిస్థితి. ఏ సీజన్‌లో నష్టపోతే అదే సీజన్‌లో పరిహారం అందిస్తున్నారు. క్రమం తప్పకుండా రైతు భరోసా సొమ్ము, రైతుకు సహాయం అందించేందుకు భరోసా కేంద్రాలు, ఉచిత పంటల భీమాతో పాటు ఎన్నో రకాల వసతులతో తమకు ఆనందంగా వుందని రైతులు అంటున్నారు.

– విజయ్ కుమార్, అనంతపురం జిల్లా