రైతు ఖాతాల్లోకి విద్యుత్‌ బిల్లుల సొమ్ము

    వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో రూ.3,97,31,348 జమ 

    వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపుసెట్ల విద్యుత్‌ బిల్లులకు సంబంధించి 3,97,31,348 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమచేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీచేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. జూన్‌ నెలలో జరిగిన విద్యుత్‌ వినియోగాన్ని లెక్కించిన తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ తమ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. ఈ మొత్తాన్ని రైతు ఖాతాల్లోకి జమ చేస్తున్నట్టు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి జీవోలో పేర్కొన్నారు. 

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/payment-electricity-bills-farmers-accounts-srikakulam-district-1377123