వరి పంట సాగులో కలుపును తీసే పవర్ వీడర్

వరి సాగులో యాంత్రీకరణ ప్రాధాన్యత నానాటికీ పెరుగుతున్న క్రమంలో వివిధ యంత్ర పరికరాలు రైతుకు చేయూతనందిస్తున్నాయి. దీనీలో భాగంగా వరుసల్లో వరి పైరు క్రమ పద్ధతిలో పెరిగే విధంగా రైతులు వరి విత్తనాన్ని ప్రధాన పొలంలో నేరుగా సీడ్ డ్రిల్ లేదా డ్రమ్ సీడర్ తో విత్తుతున్నారు. ఈ విధానంలో కలుపు సమస్య ఎక్కువ వుండటం వల్ల, కొంతమంది రైతులు కలుపు రసాయనాలు వాడకుండా పవర్ వీడర్ తో కలుపును సునాయాసంగా నిర్మూలించి, సాగు ఖర్చును తగ్గించుకుంటున్నారు. నాణ్యమైన దిగుబడి తీస్తున్నారు. . ఈ యంత్రం బరువు 15 కిలోలు. ధర రూ. 55,000.