వారానికి 5 రోజుల పని విధానం మరో ఏడాదిపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు వారానికి ఐదు రోజుల పనిదినాలు విధానాన్ని మరి కొంతకాలం కొనసాగించాలని ఏపీ సచివాలయం సంఘం, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉద్యోగుల తరఫున ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/5-days-working-week-policy-extension-another-year-ap-1374123