వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు

    ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో 3 రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు

    1. ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్-RINL ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ సంస్థనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని పిలుస్తారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మొత్తం 319 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 జూలై 17 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి. 2021 జూలై 19 సాయంత్రం 5 గంటల్లోగా పేమెంట్ చేయాలి.

    2. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో వేర్వేరు ట్రేడ్స్‌లో ఈ అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి. ఇవి ఏడాది అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఆన్‌లైన్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. 2021 ఆగస్ట్ 8న ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది.

    3. ఖాళీల వివరాలు చూస్తే మొత్తం 319 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు ఉండగా అందులో ఫిట్టర్-75, టర్నర్-10, మెషినిస్ట్-20, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్), మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్-20, ఎలక్ట్రీషియన్-60, కార్పెంటర్-20, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్- 40, మెకానిక్ డీజిల్-30, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-30 పోస్టులున్నాయి.

    4. విద్యార్హతల వివరాలు చూస్తే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 2021 అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100 చెల్లించాలి.

    5. అభ్యర్థులకు విశాఖపట్నంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. పరీక్ష గడువు 120 నిమిషాలు. యాప్టిట్యూడ్, టెక్నికల్ సెగ్మెంట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

    6. ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన అప్రెంటీస్ వెబ్‌సైట్ https://apprenticeshipindia.org/ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అందులో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత RINL VISAKHAPATNAM STEEL PLANT, VISAKHAPATNAM అని సెర్చ్ చేసి అప్లై చేయాలి.

    7. ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ అధికారిక వెబ్‌సైట్ https://www.vizagsteel.com/ లో అప్లై చేయాలి. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత కెరీర్స్ సెక్షన్‌లో Online registration for- Trade Apprentices పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

    8. Register పైన క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

    Source: https://telugu.news18.com/photogallery/jobs/rinl-recruitment-2021-visakhapatnam-steel-plant-invites-applications-for-319-trade-apprentice-posts-ss-954046-page-7.html