వైఎస్సార్ ఆసరాతో మహిళల్లో ఆనందాలు

 ఎక్కడ మహిళలు పూజింపబడతారో.. అక్కడ దేవతలు సంచరిస్తారని అర్థం. అసలు సిసలు సాధికారత సాధించిన రోజే.. మహిళకు నిజమైన గౌరవం అన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మకం ! పాదయాత్రలో చూసిన పరిస్థితులు.. ఒక్కో మహిళ పలకరించినప్పుడు పరిచయం అయిన కన్నీళ్లు.. ఇలా ఎన్నో విషయాలు ఆయనను కదిలించాయ్. అధికారంలోకి రాగానే అండగా ఉండాలని నిశ్చయించుకునేలా చేశాయ్. వైఎస్ఆస్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ రుణాలు.. ఇలా ఒక్కటా రెండా… అక్కాచెల్లెళ్లకు ఆర్ధికంగా అండగా నిలిచేందుకు… సాధికారత దిశగా వారి అడుగులు పడేందుకు.. ఎన్నో స్కీమ్‌లు తీసుకొచ్చారు సీఎం జగన్.

            అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్. 87లక్షల మంది మహిళలకు సంబంధించి 27వేల కోట్ల రుణాలను నాలుగువిడతల్లో చెల్లిస్తున్నారు. మాటలు చెప్పే నాయకులను చూశాం.. ఓ మహిళ కష్టాన్ని, కన్నీటిని అర్థం చేసుకొని.. అన్నగా అండగా నిలిచే నిజమైన లీడర్‌ జగన్ అంటూ మహిళలు నిరాజనాలు పలుకుతున్నారు. పొదుపు  సంఘాల్లో ఒక్కో రూపాయి పోగు చేసుకొని ఆ తర్వాత.. రుణాలు తీసుకొని… తమ కాళ్ల తాము నిలబడడమే కాదు.. కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. విజేతలుగా నిలుస్తున్నారు.

-వెంకటమ్మ,డ్వాక్రా మహిళ, కడప జిల్లా

పాత వడ్డీ, అసలు రెండు మాఫీ చేసి ప్రస్తుతం వడ్డీ లేకుండా రుణాలను ఇవ్వటం మా జీవితాల్లో గొప్ప అనుభూతంటూ.. ఇలాంటి పధకాలను మహిళలు తమ కాళ్ళ మీద భరోసాగా సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించటానికి మంచి అవకాశమని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

-అనంతపురం డ్వాక్రా మహిళలు

కరోనా సమయంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఎన్ని ఇబ్బందులు వున్న తమకు పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళా సంక్షేమం కోసం కృషి చేస్తూ ఆసరా పధకాన్ని ఏర్పాటు చేయటంపై విశాఖ జిల్లా డ్వాక్రా మహిళలు సంతోషపడుతున్నారు.

-విశాఖ జిల్లా ద్వాక్రా మహిళలు