మహిళలకు చేయూతగా ధైర్యాన్ని నింపుతున్న ప్రభుత్వం

నడివయస్సులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న సంకల్పంతో… రాష్ట్ర ప్రభుత్వం వైయస్ఆర్ చేయూత పథకానికి శ్రీకారం చుట్టింది. నవరత్నాల్లో భాగమైన  ఈ పథకం ద్వారా 45–60 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలకు నాలుగేళ్ల పాటు రూ.75 వేలు ఆర్థికసాయం అందిస్తోంది. తొలివిడతగా ఒక్కొక్కరికీ రూ.18,750ల చొప్పున జిల్లాలో లక్షా 81వేల మందికి రూ.339.42 కోట్లు జమ చేసింది. అసలు మొత్తానికి మూడింతలు బ్యాంకు ద్వారా ఆర్థిక చేయూతనిచ్చి మహిళలను పాారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. 

సాయం కోసం దేవుడి వైపో.. ఆకాశం వైపో చూసే రోజులు ఒకప్పుడు కనిపించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. సాయం చెయ్ అన్నా అంటే.. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందిస్తున్నారన్నది నేటి మహిళల మాట. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో సాయం అందుకొని.. ఆర్థికంగా ఇప్పుడిప్పుడు నిలదొక్కుకుంటున్నారు మహిళలు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోయి.. ఎక్కడికక్కడ నిలిచిపోయినా.. ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు సీఎం జగన్. అక్కాచెల్లెళ్ల సంతోషం కోసం కష్టపడడంలోనే అసలైన ఆనందం ఉంటుందని నిరూపిస్తూ నిజమైన నాయకుడు అనిపించుకుంటున్నారు. వ్యాపారం ఏదైనా సరే.. సాయం కోసం ఇప్పుడు ఎవరి దగ్గరో చేయి చాచాల్సిన అవసరం పోయింది. తాము నిలబడి.. మరో పది మందికి అండగా నిలబడేందుకు.. సీఎం జగన్ ఉన్నారన్న నమ్మకం.. ఇప్పుడు ప్రతీ ఆడపడుచు కళ్లల్లో కనిపిస్తోంది.

వైయస్ఆర్ చేయూత ఫధకం ద్వారా తమ కుటుంబాలలో ప్రతి రోజు పండగలా మారిందని మహిళ లభ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు కరోనా సమయంలో ఈ పధకం ద్వార చాల మేలు కలిగిందని.. ఒక అన్నలా తమను ఆదుకున్నందుకు సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

-పద్మావతి,ఒంగోలు

స్వతంత్ర్యంగా జీవానోపాధి కోసం వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవటంతో పాటు అందుకు కావాల్సిన మార్కెటింగ్ నైపుణ్యాలపై శిక్షణను ఏర్పాటు చేయటం వల్ల తాము వ్యాపారంలో మరింత అభివృధ్దిలో ముందుకు సాగుతున్నామని అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీ దేవి అంటున్నారు.

-లక్ష్మీ దేవి, అనంతపురం జల్లా