వైఎస్సార్ సంపూర్ణ పోషణ

చిన్నారులతో పాటు బాలింతలు, గర్బిణీలు ఆరోగ్యంగా ఉంచాలని భావించి, పలు పథకాలను ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తాజాగా ఏపీలో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించింది. రాష్ట్రంలోని 55వేల 607 అంగన్ వాడీల పరిధిలో 1863  కోట్ల వ్యయంతో 30లక్షల 16వేల మంది అక్కాచెల్లెమ్మలు, చిన్నపిల్లలకు వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించగా  గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు బలవర్ధకమైన పోషకాహారాన్ని అందించడమే ఈ రెండు పథకాల లక్ష్యం

అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్సార్‌ అమృత హస్తం, మధ్యాహ్న భోజన పథకం, బాలామృతం, వైఎస్సార్‌ బాల సంజీవనికి అదనంగా వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేస్తున్నారు.  బాలింతలకు…  36 నెలల నుంచి 72 నెలల్లోపు పిల్లలకు…. ప్రత్యేకంగా పోషకాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పధకం కింద ఒక్కొక్కరిపై ప్రభుత్వం 412 రూపాయలు ఖర్చు చేయనుంది. 

ఈ పథకాన్ని 77 గిరిజన మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 47,287 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్నారు. 5.80 లక్షలమంది గర్భిణీలు, బాలింతలకు నెలలో 25 రోజులు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, కోడి గుడ్లు సరఫరా చేస్తారు. టేక్‌ హోం న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 250 గ్రాముల వేరుశనగ చిక్కీ, కిలో రాగి పిండి, 250 గ్రాముల బెల్లం, మరో 250 గ్రాముల ఎండు ఖర్జూరం, కిలో సజ్జ పిండి అందిస్తారు. దీని కోసం ఒక్కొక్కరిపై నెలకు రూ.850 చొప్పున మొత్తం రూ.591.60 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది