వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లగా అంగన్‌వాడీలు

 ‘మనబడి నాడు-నేడు’ కింద రెండో విడత పనులు ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ‘మనబడి నాడు– నేడు, జగనన్న విద్యా కానుక’పై  సమీక్ష నిర్వహించారు.  రెండో విడతలో భాగంగా ప్రైమరీ పాఠశాలలు 9,476, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లు 822, రెసిడెన్షియల్‌ స్కూళ్లు సహా హైస్కూళ్లు 2,771, జూనియర్‌ కాలేజీలు 473, హాస్టళ్లు 1,668, డైట్‌ కాలేజీలు 17, ఎంఆర్‌సీఎస్‌ 672, భవిత కేంద్రాలు 446 చోట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్ని, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ గిరిజా శంకర్, మహిళా శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, సర్వ శిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.