వైయస్ఆర్ పెళ్లి కానుక

నిరుపేద కుటుంబాలలో పెళ్లి చేసి అప్పులు పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇవ్వటానికి వైయస్ఆర్ పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం ఏపీలోని పేదింటి ఆడపడుచులకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న పెళ్లి కానుక ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది. 

పెంచిన పెళ్లి కానుక వివరాలు:

 • ఎస్సీలకు రూ.40 వేల నుంచి రూ.లక్షకు పెంపు.
 • ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.75 వేల నుంచి రూ. 1.20 లక్షలకు పెంపు.
 • ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంపు.
 • బీసీలకు రూ.35వేల నుంచి రూ.50 వేలకు పెంపు.
 • బీసీ కులాంతర వివాహానికి రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంపు.
 • మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు.
 • దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ. లక్షన్నరకు పెంపు.
 • భవన నిర్మాణ కార్మికులకు రూ.20 వేల నుంచి రూ.లక్షకు పెంపు.

పెళ్ళి కానుక పధకానిరి అర్హులు :

 • వధువు, వరుడు ఇద్దరు ప్రజాసాధికారిక సర్వే నందు నమోదు కాబడి ఉండాలి
 • వధువు, వరుడు ఇద్దరూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి.
 • వధువు, వరుడు ఇద్దరు ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
 • వధువు కచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
 • వివాహ తేదీ నాటికి వధువుకు 18 ఏళ్లు, వరుడుకు 21 ఏళ్లు పూర్తై ఉండాలి
 • కేవలం మొదటి సారి వివాహం చేసుకునేవారు మాత్రమే ఈ పథకంకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పథకమునకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 • వివాహం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జరగవలెను.

ధరఖాస్తు చేసుకునే విధానం:

 • కులము – కమ్యూనిటీ మరియు జనన దృవీకరణ పత్రము.
 • వయసు – ఎస్ఎస్సి సర్టిఫికెట్ 2004 వ సంవత్సరం, ఆ తర్వాత పదవ తరగతి పాస్ అయిన వారికి(లేదా) డేట్ ఆఫ్ బర్త్(లేదా) ఆధార్ కార్డ్.
 • ఆదాయము (వధువు కి మాత్రమే) – తెల్ల రేషన్ కార్డు/ఇన్కమ్ సర్టిఫికెట్.
 • నివాసం – ప్రజా సాధికారిక సర్వే నందు నమోదు/హౌస్ హోల్డ్ సర్వే.
 • అంగవైకల్యం – సదరం సర్టిఫికెట్ ( కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి)
 • వితంతువు – ఆధార్ నెంబర్ ఆధారముగా ఫించన్ డేటాతో పరిశీలిస్తారు.
  వితంతువు అయ్యుండి పింఛన్ పొందకపోతే లేదా పించన్ డేటాలో వివరాలు లేకపోతే వ్యక్తిగత దృవీకరణ.
 • భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు – ఎ.పి.బి.ఓ.సి.డబ్ల్యూ. డబ్ల్యూ.బి. చే జారీ చేయబడిన కార్మికుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డ్.

పెళ్ళికానుక వెబ్ సైట్
http://ysrpk.ap.gov.in/Dashboard/index.html

పెళ్ళికానుక స్టేటస్
https://ysrpk.so.gov.in/Registration/cpk