వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం

స్వయం సహాయక సంఘాల మహిళల కోసం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏపీ ప్రభుత్వం. సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8లక్షల 78 వేల పొదుపు సంఘాల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. 90 లక్షల 37 వేలు మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో 14వందల కోట్లు ఒకే విడత జమ అవుతాయి. డబ్బు జమ అయినట్లు రశీదు, ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసేందుకు సెర్ప్, మెప్మా అధికారుల ఫోన్‌ నంబర్లు లేఖతో పాటే అందజేస్తారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పావలా వడ్డీ పథకం ప్రారంభమైంది. తర్వాత అది సున్నా వడ్డీ పథకంగా మారింది. 2016లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నిధులివ్వక పోవడంతో ఈ పథకం ఆగిపోయింది. కరోనా వంటి కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా.. ఆగిపోయిన ఈ పథకానికి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదేనని పొదుపు సంఘాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి లేఖ రాశారు. ఇలా మహిళా సాధికారతే తమ ప్రాధాన్యమంటూ ఎన్నో పథకాలను శ్రీకారం చుడుతూ ప్రభుత్వం ముందుకు సాగుతుంది.