వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు

  భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఆధ్వర్యంలోని విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌.. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

  ► మొత్తం ఖాళీల సంఖ్య: 319
  ► విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఫిట్టర్‌–75, టర్నర్‌–10, మెషినిస్ట్‌–20, వెల్డర్‌(గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌)–40, మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌–20, ఎలక్ట్రీషియన్‌–60, కార్పెంటర్‌–20, మెకానిక్‌ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఎయిర్‌కండిషనింగ్‌–14, మెకానిక్‌ డీజిల్‌–30, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌–30.

  ► అర్హత: ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. 

  ► వయసు: 01.10.2020 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 

  ► ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 150 ప్రశ్నలు–150 మార్కులకు పరీక్ష ఉంటుంది. 

  ► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

  ► దరఖాస్తులకు చివరి తేది: 17.07.2021

  ► వెబ్‌సైట్‌www.vizagsteel.com