విశాఖ స్టీల్ ప్లాంట్ మరో రికార్డు సాధించింది. జులై నెలలో 540.8 వేల టన్నుల స్టీల్ విక్రయాలు జరిపి రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పోలిస్తే 35 శాతం అధికంగా అమ్మకాలు జరిపింది. ఏప్రిల్-జులై మధ్య 1,538 వేల టన్నుల స్టీల్ విక్రయాలు జరిపినట్లు ఆర్ఐఎన్ఎల్ ట్విటర్లో తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఆ 4 నెలల్లో 48 శాతం అదనంగా విక్రయించినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కార్మికులు గత రెండు రోజులుగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/visakhapatnam-steel-plant-recorded-sales-1384620