వైద్యుల గౌరవ వేతనాల పెంపు

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, పీజీలకు రెసిడెంట్ స్పెషలిస్టులకు గుడ్ న్యూస్..!

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలు, ప్రభుత్వాసుపత్రుల్లో సేవలందిస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, పీజీలకు రెసిడెంట్ స్పెషలిస్టులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరందరికీ గౌరవ వేతనాన్ని పెంచుతూ వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ రెసిడెంట్ వైద్యులకు 70 వేలకు , రెసిడెంట్ డెంటిస్టులకు 65 వేలు, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు 85 వేలకూ వేతనాన్ని పెంచుతూ ఈ సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పెంపు 2020 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.