వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రజారోగ్య పరిధిలో ఖాళీగా ఉన్న 44 వైద్యుల పోస్టులకు దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ గురువారం పేర్కొన్నారు. ఎంబీబీఎస్‌ విద్యార్హత, ఈ ఏడాది జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను cfw.ap.nic.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, పూర్తి చేసి ఈ నెల 13 నుంచి 24వ తేదీ వరకు గొల్లపూడిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ పోస్టులన్నీ శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు.