వైద్య ఆరోగ్యం - Health

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జగన్ ప్రభుత్వం అనేక విప్లవాత్మక , సాహసోపేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ద్వారా దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అతి స్వల్ప కాలంలో భారీ వైద్య సంస్కరణలకు బీజం వేసింది. వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు వున్న వారందరని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తద్వారా రాష్ట్రంలోని 85 శాతం మంది ఉచిత వైద్య సేవలు పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా అవతరించిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఒక్క వైద్య కళాశాల కూడ నిర్మించలేదు. కానీ ఈ ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజక వర్గంలో ఒక ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటు చేయాలన్న సమున్నత ఆశయంతో 16 చోట్ల నిర్మాణ పనులను భూమి పూజ పూర్తి చేసి శరవేగంగా దూసుకెళ్తోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వైద్యుల సంఖ్య పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఉత్తమ ఫలితాలు తీసుకుందని వైద్య రంగంలోని మేధావులు ప్రశంసిస్తున్నారు.

సమస్యల నిలయాలుగా వున్న ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో కూడిన వైద్య కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రభుత్వం “నాడు-నేడు” అమలు చేస్తోంది. దీని ఫలితాలు ఇప్పటికే మొదటి విడత నాడు-నేడు కింద అభివృధ్ది పనులు చేపట్టిన ఆసుపత్రుల్లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. నాడు నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి పనులకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో రూ.1,535 కోట్లు కేటాయించింది.

ఒకే రోజు 1088 అంబులెన్స్ లకు పచ్చజెండా

అత్యవసర వైద్యం అవసరమయిన వారిని తక్షణం ఆసుపత్రులకు తరలించి ఉత్తమ వైద్యం అందించటం లక్ష్యంగా జగన్ ప్రభుత్వం గత ఏడాది ఒకే రోజు 1088 కొత్త అంబులెన్స్ లను కొనుగోలు చేసి సేవలకు పచ్చ జెండా ఊపింది. గత ప్రభుత్వ హయాంలో పడకేసిన 104 (సంచార వైద్య సేవలు),108 అంబులెన్స్ సేవలకు ఈ ప్రభుత్వం కొత్త వాహానాలతో ఊపిరి పోసింది. కోవిడ్-19 నియంత్రణ, అడ్డుకట్ట చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. అత్యధిక రాష్ట్రాలు ప్రతి రోజు వేల సంఖ్యలో మాత్రమే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సగటున లక్షకు పైగా పరీక్షలు జరిపింది. కంటోన్మెంట్ జోన్ ల ఎంపిక నిర్వహణలోను ఆదర్శంగా నిలిచి కేంద్రం నుండి ప్రశంసలు అందుకుంది. పేద రోగులకు భరోసానిస్తూ 2,400 జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చడంతోపాటు దేశంలోనే మొదటిసారిగా కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత రాష్ట్రానికే దక్కింది. పేదల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా తాజాగా ఖరీదైన బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సనూ ఆరోగ్యశ్రీలో చేర్చింది. ఆరోగ్య రంగానికి గత ఆర్థిక సంవత్సరం రూ.9,426.49 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఈ మొత్తాన్ని రూ.13,830.44 కోట్లకు పెంచింది.

సాయంలోనూ ఆదర్శం

కోవిడ్ మహమ్మారి వల్ల తల్లింతండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలకు జగన్ సర్కార్ అండగా నిలిచింది. సంరక్షకులను కోల్పోయిన పిల్లల పేరుతో రూ.10 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసింది. వీధిన పడిన పిల్లల భవిష్యత్ భరోసా కోసం ఇలా ఇంత మొత్తం సాయం ప్రకటించిన రాష్ట్రం మరొకటి లేకపోవటం గమనార్హం. కోవిడ్ వల్ల మరణించిన వారికి దహన సంస్కారాల కోసం రూ.15 వేల చొప్పున సాయం కూడా అందిస్తోంది.

సంబంధిత సమాచారం

గర్భిణులకు, పిల్లలకు పది రకాల వ్యాక్సిన్లు

చిన్నారులను దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతోంది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు జరిగే వరకు, పుట్టిన శిశువుల నుంచి యుక్తవయస్సు వచ్చే వరకు క్రమం తప్పకుండా...

ఫ్యామిలీ డాక్టర్‌ కోసం ప్రత్యేక యాప్‌

1,142 పీహెచ్‌సీల్లో వైద్యులకు మొబైల్‌ ఫోన్లు విలేజ్‌ క్లినిక్స్‌/సచివాలయాల్లో డాక్టర్ల ఫోన్‌ నెంబర్‌సమర్థంగా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ పక్కా...

ప్రభుత్వాసుపత్రుల్లోనే శిశువులకు ఆధార్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన శిశువులకు వెంటనే ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ రానుంది. ఈ ప్రక్రియను త్వరలో ప్రారంభించడానికి వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ చేపట్టడానికి ఏరియా, జిల్లా, బోధన ఆస్పత్రులకు...

విజయ గాథలు

టెలీమెడిసిన్‌ సేవల్లో ఏపీ రికార్డు

వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లో టెలీమెడిసిన్‌ ద్వారా హబ్‌లోని వైద్యుడితో వీడియోకాల్‌లో మాట్లాడుతున్న రోగి (ఫైల్‌) ఒక్కరోజులో లక్ష కన్సల్టేషన్లుదేశంలో మొదటి రాష్ట్రంగా గుర్తింపుసోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2.04 లక్షల కన్సల్టేషన్లు నమోదువీటిలో ఒక్క ఏపీ...

వీడియోలు

Advertisment