వైద్య రంగంలో ప్రగతి సాధించిన ఏపీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు . ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను, పీహెచ్‌సీలను నాడు-నేడు పేరుతో అభివృద్ధికి శ్రీకారం చుట్టింది .

రాష్ట్రంలో అంబులెన్స్ వ్యవస్థకు సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ప్రాణం పోశారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడే ఈ అంబులెన్స్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళనకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జులై ఒకటి 2020 న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 1088 అధునాతన 108 ,104 అంబులెన్స్‌లను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు . దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తరువాత వైద్యానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విశ్లేషకులు అంటున్నారు .

సకాలంలో వైద్యం అందక ఏ ఒక్క రోగి కానీ…. ప్రమాదానికి గురైన వారు కానీ… చిన్నారులు కానీ మృత్యువాత పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన అంబులెన్సులను పెద్ద సంఖ్యలో ఒకేసారి అందుబాటులోకి తీసుకువచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి .

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకే సారి 412 కొత్త 108 అంబులెన్స్ వాహనాలు కొనుగోలు చేయగా…వీటిలో 104 అడ్వాన్స్ డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు మరో 282 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లు, చిన్నారుల ప్రాణాలు కాపాడే 26 నియోనేటాల్ అంబులెన్స్ లు ఉన్నాయి.676 కొత్త 104 అంబులెన్స్ సర్వీసులను అందుబాటులో ఉంచింది. కొత్త అంబులెన్స్ ల కోసం సుమారు 201 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం .