వైద్య శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ లు

వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయడానికి 31 (ఓపెన్‌ కేటగిరి) సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ హైమావతి తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేస్తున్నామన్నారు. ఎంబీబీఎస్‌ విద్యార్హత కలిగి, మెడికల్‌ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవడంతో పాటు, గత ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి 42 ఏళ్ల వయస్సు మించని వారు అర్హులని ఆమె తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మూడేళ్లు.. శారీరక వికలాంగులకు పదేళ్లు.. ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కేటగిరీ వారికి మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుందన్నారు. hmfw.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని డాక్టర్‌ హైమావతి తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు ఈ నెల 19వ తేదీ సా.5.30 గంటల వరకు ఉంది.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/notification-31-medical-posts-ap-1455084