వైయస్ఆర్ కాపు నేస్తం

రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి కులాలకు చెందిన పేద కుటుంబాలలో మహిళల జీవనోపాధి మెరుగుదలకు మరియు వారి ఆర్ధిక స్వావలంబన కొరకు సంవత్సరానికి రూ. 15,000/- చొప్పున.. ఐదు సంవత్సరాలలో రూ. 75,000/- ఆర్ధిక సహాయం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.

అర్హతలు:
45 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి కులాలకు చెందిన మహిళలు.

  • నెలసరి కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.10,000/- లోపు పట్టణ ప్రాంతాలలో రూ.12,000/- లోపు ఉన్నవారు అర్హులు.
  • కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి 10 ఎకరాల లోపు మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉన్నవారు అర్హులు.
  • పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగులు, అంతకన్న తక్కువ విస్తీర్ణములో ఇల్లు ఉన్నవారు అర్హులు.
  • ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, 4 చక్రాల వాహనము ( ఆటో, టాటా ఏస్,ట్రాక్టర్లకు మినహాయింపు) కలిగి ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనర్హులు.

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానము:

అర్హత కలిగిన కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి కులములకు చెందిన మహిళలు తమ ఆధార్ కార్డు నకలు, కుల ధృవీకరణ పత్రము జత చేసి నిర్ణీత దరఖాస్తును గ్రామ/వార్డు సచివాలయాలలో గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా సమర్పించవలెను.

లభ్ధిదారులకు కావాల్సిన సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కోసం ఉచితంగా కాల్ చేయాల్సిన టోల్-ఫ్రీ నంబర్ 1902