వైయస్ఆర్ నేతన్న నేస్తం

స్వంత మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు సంవత్సరానికి రూ. 24,000/- ఆర్థిక సహాయం.

అర్హతలు:

  • స్వంత మగ్గం కలిగియుండి దానిపై పనిచేస్తూ జీవనోపాధి పొందుచున్న చేనేత కార్మికులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
  • కుటుంబంలో ఎన్ని చేనేత మగ్గములు ఉన్నప్పటికీ ఒక్క చేనేత మగ్గమునకు మాత్రమే ఆర్థిక సహాయం అందించబడుతుంది.
  • ఈ పథకంలో లబ్ధి పొందాలంటే సంబంధిత చేనేత కుటుంబము దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి.
  • ప్రాథమిక చేనేత సంఘముల మరియు మాస్టర్ వీవర్ల షెడ్లలో పనిచేయుచున్న చేనేత కార్మికులు వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకమునకు అనర్హులు.
  • చేనేత అనుబంధ వృత్తులలో పనిచేయు కార్మికులు ఈ పథకం ద్వారా సహాయం పొందుటకు అనర్హులు (ఉదా . నూలు వడుకువారు, పడుగు తయారుచేయువారు, అద్దకం పనివారు,అచ్చులు అతికేవారు మొదలైనవారు).

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానము:

  • అర్హత కల్గిన చేనేత కార్మికులు తమ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, కుల మరియు బియ్యం కార్డు తెలుపు రేషన్ కార్డు నకలు పత్రములను జతచేసిన దరఖాస్తును, గ్రామ/వార్డు సచివాలయాలలో స్వయంగా గాని లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గాని సమర్పించవలెను.
  • దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్ని పూర్తి చేసి అర్హత కలిగిన వారికి సంవత్సరానికి రూ. 24,000/- ఒకసారి మంజూరు చేసే వై.యస్.ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధి చేకూర్చబడుతుంది.

లభ్ధిదారులకు కావాల్సిన సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కోసం ఉచితంగా కాల్ చేయాల్సిన టోల్-ఫ్రీ నంబర్ 1902