వైఎస్ఆర్ పింఛను కానుక

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్యపు, వింతతు పింఛన్లను రూ.2,250కి పెంచుతూ నవరత్నాల్లో తొలి హామీ అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12 రకాల పింఛన్లను ప్రతి నెలా పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, కిడ్నీ రోగులు, ఎయిడ్స్‌ బాధితులు, దివ్యాంగులకు పింఛన్లు అందజేస్తున్నారు. పింఛనును రూ.3 వేల వరకు పెంచుకుంటూ వెళ్తామన్న సీఎం జగన్‌ హామీ నేపథ్యంలో మొదటి విడతగా రూ.2,250కు పెంచారు. గత ప్రభుత్వం 40 నుంచి 79 శాతం అంగవైకల్యం ఉన్న వారికి నెలకు రూ.2 వేలు, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉంటే రూ.3 వేల చొప్పున ఇచ్చేది. తాజాగా ఈ తేడాలేమీ లేకుండా దివ్యాంగులందరికీ రూ.3 వేల చొప్పున అందజేయనున్నారు. దీని వల్ల 3,89,094 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది.

అర్హతలు:

  • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10,000 మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12,000 కంటే తక్కువ ఉండాలి.
  • మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు.
  • కుటుంబం మొత్తానికి నాలుగు చక్రాల వాహనము వుండరాదు. (అయితే, ట్యాక్సీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాక్టర్స్, ఆటోలు వున్న వారు మినహాయింపు).
  • కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు.
  • కుటుంబం నివసిస్తున్న గృహం (సొంతం/ అద్దె) యొక్క నెలవారీ విద్యుత్ వినియోగ బిల్లు 300 యూనిట్లు లోపు ఉండవలెను. (గత ఆరు నెలల విద్యుత్ వినియోగ బిల్లు యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండవలెను).
  • పట్టణ ప్రాంతంలో నిర్మాణపు స్థలము 1000 చదరపు అడుగులు కంటే తక్కువ ఉండాలి.
  • కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో వుండరాదు. సాధారణంగా ఒక కుటుంబానికి ఒక పింఛను (40% మరియు ఆపైన అంగవైకల్యం కలవారు మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మినహా) మాత్రమే.

కేటగిరీల వారీగా నెలవారీ పింఛను మరియు అర్హతలు:

జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకొనే విధానము:

  • పైన తెలిపిన అర్హతలు కలిగిన వారు దరఖాస్తులను స్వయంగా గ్రామ/ వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చును.
  • ఈ దరఖాస్తు చేసిన 10 రోజులలో అర్హులైన దరఖాస్తుదారునికి వై.యస్.ఆర్. పింఛను కానుక కార్డు వాలంటీర్ల ద్వారా ఇవ్వబడుతుంది.

లభ్ధిదారులకు కావాల్సిన సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కోసం ఉచితంగా కాల్ చేయాల్సిన టోల్-ఫ్రీ నంబర్ 1902