వైయస్ఆర్ వాహన మిత్ర

ఆటో, ట్యాక్సీ, మరియు మ్యాక్సీ- క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 10,000/- బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మత్తులు మొదలైనవాటికి ఖర్చుల నిమిత్తం వాహన మిత్ర పథకం ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తుంది.

అర్హతలు:

  • దరఖాస్తుదారుడు స్వీయ యాజమాన్యంలోని ఆటో, ట్యాక్సీ, మరియు మ్యాక్సీ – క్యాబ్ డ్రైవర్ అయి ఉండవలెను.
  • ఆటోరిక్షా / లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • ఆటోరిక్షా/ట్యాక్సీ, మరియు మ్యాక్సీ- క్యాబ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు ఎల్టి క్యాబ్స్ విషయంలో పన్ను వంటి చెల్లుబాటు అయ్యే రికార్డులు కలిగి ఉండాలి.
  • ఈ పధకం, ప్యాసింజర్ ఆటోరిక్షా/ట్యాక్సీ, మరియు మ్యాక్సీ – క్యాబ్ యజమానులకు వర్తిస్తుంది. శ్రీ వీలర్ / ఫోర్ వీలర్ లైట్ గూడ్స్ వాహనాల యజమానులు ఈ పధకం క్రింద అర్హులు కారు.
  • ప్రతి దరఖాస్తుదారుడికి ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
  • యజమాని తప్పనిసరిగా బియ్యం కార్డు (బిపిఎల్ / వైట్ రేషన్ కార్డు/ అన్నపూర్ణ కార్డు/ అంత్యోదయ కార్డు )కలిగి ఉండాలి.
  • కుటుంబం అంటే భర్త, భార్య మరియు మైనర్ పిల్లలు. కుటుంబంలో ఒక వాహనానికి (ఆటోరిక్షా/ట్యాక్సీ, మరియు మ్యాక్సీ – క్యాబ్) మాత్రమే ఈ పధకం క్రింద ప్రయోజనం పొందడానికి అర్హులు.
  • ఒకే బియ్యం/వైట్ రేషన్ కార్డులో వేర్వేరు వ్యక్తులపై యాజమాన్యం మరియు లైసెన్స్ అనుమతించబడుతుంది. ఏదేమైనా ఒకే బియ్యం/వైట్ రేషన్ కార్డులో భర్త, భార్య మరియు మైనర్ పిల్లలతో కూడిన కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే ఆర్ధిక సహాయం కోసం అర్హులు.
  • లబ్ధిదారుడు తండ్రి/తల్లి కుమార్తె సోదరుడు మరియు డ్రైవింగ్ లైసెన్స్ మేజర్ కుమారుడు / కుమార్తె పేరిట ఉంటే, వాహనం యొక్క రిజిస్టర్డ్ యజమాని అయిన తండ్రి/తల్లి/కుమార్తె/ సోదరుడు ప్రయోజనం పొందటానికి అర్హులు, వారి పేర్లు వేర్వేరు బియ్యం కార్డు/వైట్ రేషన్ కార్డులలో ఉన్నప్పటికీ అర్హులు.
  • ఇతర రాష్ట్రాలు జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్సులను కలిగి ఉన్న లబ్ధిదారులు సంబంధిత ఆర్.టి.వో కార్యాలయంలో చిరునామా మార్పు కొసం దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు సమయంలో, వాహనం యజమాని వద్ద ఉండాలి.
  • కొత్త లబ్దిదారుల దరఖాస్తులను గ్రామ / వార్డు వాలంటీర్లు సేకరించి వారి అర్హతలను ధృవీకరిస్తారు.
  • బ్యాంకు ఖాతా వాహనం యజమాని పేరుమీద ఉండాలి. లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులలో ఏదైనా ఒకటి కావచ్చు . బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజి నకలును సమర్పించాలి.
  • ఎస్సీ/ఎస్టీ/బిసి/ మైనారిటీల కమ్యూనిటీ విషయంలో కుల ధృవీకరణ పత్రము ఉన్నచో దరఖాస్తుతో జతపరచవలెను.
  • వాహనం భార్య పేరిట ( డ్రైవింగ్ లైసెన్సు కలిగి లేదు) ఉండి భర్త నడుపుతుంటే ( భర్తకు డ్రైవింగ్ లైసెన్స్ వున్నచో) అలాంటి దరఖాస్తుదారులను కూడా అర్హులుగా పరిగణిస్తారు.

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానము:

  • కొత్త లబ్ధిదారులు గ్రామ / వార్డు వాలంటీరుల నుండి దరఖాస్తులను పొందవచ్చును లేదా ఇక్కడ www.navasakam.ap.gov.in వెబ్ సైట్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తును గ్రామ / వార్డు వాలంటీర్ల వద్ద దాఖలు చేయవచ్చును.
  • దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్నీ పూర్తిచేసి అర్హత కలిగిన సలహాలు, సూచనలు మరియు వారికి సంవత్సరానికి ఒక్కసారి రూ. 10,000/- మంజూరు చేసే వైయస్ఆర్ వాహనమిత్ర పధకం ద్వారా లబ్ధి చేకూర్చబడుతుంది.

లభ్ధిదారులకు కావాల్సిన సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కోసం ఉచితంగా కాల్ చేయాల్సిన టోల్-ఫ్రీ నంబర్ 1902