వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యత

    ఆంధ్రప్రదేశ్‌లో  వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని వ్యవసాయ కమిషనర్ అరుణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాల స్థాయిలో జూన్‌ నెలాఖరుకు యంత్ర సేవా కేంద్రాలు  ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సంఘాల ద్వారా 3,250 వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జులై 8న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రైతులకు సబ్సిడీ అందజేస్తారని తెలిపారు. నాణ్యమైన యంత్ర సామగ్రిని  సరైన  ధరలకు రైతులకు అందించాలని కంపెనీలను ఆయన ఆదేశించారు. సహకరించక పోతే కంపెనీల డీలర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని ఆయన హెచ్చరించారు.