శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో ప్రెస్ అకాడమీ ఒప్పందం

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో ప్రెస్ అకాడమీ ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జర్నలిస్టుల నైపుణ్యాలను పెంచేలా ప్రెస్ అకాడమీ వివిధ విశ్వవిద్యాలయాలతో సంయుక్తంగా పని చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. ఆయా విశ్వవిద్యాలయాల్లో జర్నలిజం విభాగంలో అడ్మిషన్లు తీసుకున్న జర్నలిస్టులను ప్రోత్సహిస్తూ పీజు రాయితీని కల్పిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో ప్రెస్ అకాడమీ ఒప్పందం కుదుర్చుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విలేకరులు తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, విశ్వవిద్యాలయాల్లో ఆ మేరకు సిలబస్ లో మార్పులు చేయాలని కోరారు. పాత్రికేయులకు శిక్షణ తరగతులు నిర్వహించే ఏర్పాట్లు కూడా చేస్తామని తెలిపారు. వివిధ విశ్వవిద్యాలయాల సమన్వయంతో సదస్సులు, వర్క్ షాపులు నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించమన్నారు.

ప్రభుత్వ పథకాలు, వివిధ కార్యక్రమాల్ని ఆయా వర్గాలకు చేర్చడానికి యూనివర్సిటీలతో కలిసి పని చేయాలని భావిస్తున్నామని వివరించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాల్లో విశ్వవిద్యాలయ రిజిస్ట్రారు డిఎం మమత, ప్రెస్ అకాడమి కార్యదర్శి ఎం.బాలగంగాధర్ తిలక్ లు సంతకాలు చేసి చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ సమక్షంలో పరస్పర ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.