గుంటూరు జిల్లాలో జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ నిరుద్యోగుల కోసం పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో తమ అర్హతల సమాచారంతో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తమ రిజిస్ట్రేషన్ కు ఫిబ్రవరి 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు, ఖాళీలు:

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించిన జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఫే కేర్ సంస్థలో జూనియర్ ఎగ్జిగ్యూటీవ్ విభాగంలో 200 ఖాళీలు ఉన్నాయి. బీఫార్మసీ/ఎంఫార్మసీ/బీఎస్సీ/ఎంఎస్సీ/బీటెక్-బయోటెక్నాలజీ, మైక్రోబయోలజీ, బయోకెమెస్ట్రీ, బీఎస్సీ(న్యూట్రీషియన్&డైటీషియన్), బీఈ బయోకెమికల్, బీపీటీ, నర్సింగ్, జూవాలజీ&లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 2018-2021 వరకు పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వేతనం ఉంటుంది. ఎంపిక తరువాత అభ్యర్థులు మంగళగిరి ప్రాంతంలో పని చేయాల్సి వుంటుంది.

రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 26న ఉదయం 10 గంటలకు సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చేబ్రోలు, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ :
రవీంద్ర-7702700990

https://twitter.com/AP_Skill/status/1496467712633360389?s=20&t=S4BuYyEzMXtYeOkgtmeSsw