రైతు శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తోన్న ప్రభుత్వానికి ఎంత చేసినా ఇంకేదో చేయాలన్న తాపత్రయంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతు బాంధవుడిగా మారారు. రైతు భరోసాను తీసుకొచ్చి ఆ తర్వాత.. భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. పెట్టుబడి ఖర్చులు ఇవ్వడంతో పాటు.. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు. ఇక రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం మొదలు పంట అమ్మకం వరకూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. పంట రుణాలు, ఇన్స్యూరెన్స్, గిట్టుబాటు ధర కల్పించేలా రైతులకు మరింత చేరువగా ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి.
వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే ఓ వినూత్న ప్రయత్నానికి ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలను ఆకట్టుకుంటూ. కేంద్రవ్యవసాయ శాఖ కూడ ఈ భరోసా కేంద్రాలకు తమ మధ్దతు తెలిపింది. అన్నదాత ఇంటి ముంగిటకే సాగుకు సంబంధించిన అన్ని రకాల సేవలు అందించడానికి గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 10,641 రైతు భరోసా(ఆర్బీకే) కేంద్రాలను ప్రారంభించారు.
రైతు భరోసా కేంద్రాలు అందించే సేవలు :
- నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు.. ఇతరత్రా అన్నీ గ్రామంలోనే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవి సమగ్ర వ్యవసాయ సేవా కేంద్రాలుగా గ్రామ సచివాలయాల సమీపంలోనే ఇవి ఉంటాయి. అక్కడ స్థలం లేకపోతే మరోచోట అద్దెకు తీసుకుంటారు.
- నియోజకవర్గంలో ఏర్పాటయ్యే అగ్రి ల్యాబ్య్ లలో పరీక్షించి, ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్ని క్షేత్ర స్థాయిలో రైతులకు అందిస్తుంది. ఈ కేంద్రంలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయాధికారి రైతులకు ఉత్తమ సాగు విధానాలు, ఇతరత్రా సూచనలు, సలహాలు ఇస్తారు.
- షాపులో అందుబాటులో ఉండే ఎరువులు, విత్తనాలు.. తదితరాలను అందరికీ కనిపించేలా ప్రదర్శిస్తారు. సరసమైన ధరకు ఇక్కడ అందజేస్తారు.
- కియోస్క్ ద్వారా రైతు తనకు కావాల్సిన వాటిని ఆర్డర్ చేస్తే 48 నుంచి 72 గంటల్లో సరఫరా చేస్తారు. భూసార పరీక్ష చేయించుకునే సౌకర్యం ఉంటుంది.
- ఆర్బీకేలో అంతర్భాగంగా విజ్ఞాన కేంద్రం ఉంటుంది. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, సాగును లాభసాటిగా చేయడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. ఆడియో, వీడియోల సాయంతో మెళకువలు నేర్పుతారు. సేంద్రీయ ఎరువులైన జీవామృతం, ఘనామృతం, వేపాకు కషాయం వంటి వాటి తయారీలో శిక్షణ ఇస్తారు. ఏ ఎరువు ఎందుకు అవసరమవుతుందో చెబుతారు.
గ్రామాలను కలుపుతూ అగ్రీ హబ్ లు
- రైతు భరోసా కేంద్రాల నుంచి వచ్చే ఆర్డర్ల ప్రకారం ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇతరత్రాలు అగ్రీ హబ్‌ల నుంచి సరఫరా అవుతాయి. వీటి నుంచి సరుకు రైతు భరోసా కేంద్రాలకు.. అక్కడి నుంచి రైతులకు వెళుతుంది. నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక హబ్ ఏర్పాటు చేసారు.
- ఆర్బీకేలలో అమ్మే ఉత్పాదకాలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆదేశం. ఈ కేంద్రాలలో కొన్న విత్తనం మొలకెత్తకపోయినా, పురుగు మందు పని చేయకపోయినా, రైతులకు పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో ల్యాబ్‌లు, ఇన్పుట్ షాపులు, నాలెడ్జ్ సెంటర్లపై బాధ్యత మరింత పెరిగింది.
- ఈ షాపులు ద్వారా రైతు బయటకు వెళ్లాల్సిన పని అవసరం వుండదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా, మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సెంటర్లుగా కూడా పని చేస్తాయి. ఈ షాపుల్లోనే కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది.
రైతు భరోసా కేంద్రాల్లో డిజిటల్ సేవలు
- రైతు భరోసా కేంద్రాలు రెండు ప్రధాన విభాగాలుగా ఉంటాయి. ఒకటి డిజిటల్ కియోస్క్, రెండవది వర్క్‌షాప్, శిక్షణ విభాగం. ఎవరైనా రైతు ఈ కేంద్రంలోని డిజిటల్ కియోస్క్‌ను ఆన్ చేస్తే వ్యవసాయ ఉత్పాదకాలకు సంబంధించి ఆయా కంపెనీల ఉత్పత్తులు, వాటి ధరలు టెలివిజన్ తెరపైన కనిపిస్తాయి.
- రైతులు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, తదితరాలను క్లిక్ చేస్తే ఆర్డర్ తయారవుతుంది. అది సమీపంలోని ఆగ్రోస్ కేంద్రానికి వెళుతుంది. ఇలా జిల్లాకు 5 చొప్పున 65 ఆగ్రోస్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఒక్కో కేంద్రానికి కొన్ని పంచాయితీలలోని రైతుల వివరాలను అనుసంధానం చేస్తారు.
- వర్క్‌షాపుల ద్వారా భూసార పరీక్షలు, వివిధ అంశాలపై వీడియోల ప్రదర్శన, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో రూ.2 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను (ట్రాక్టర్‌తో ఉపయోగించేవి) అందుబాటులో ఉంచి నామమాత్రపు అద్దెకు ఇస్తారు.
- పంటల బీమా, ఇ–కర్షక్‌లో పంట నమోదు వంటి సేవలు లభిస్తాయి. పశు సంవర్థక శాఖ సేవలు సైతం లభిస్తాయి. పశు ఆరోగ్య సంరక్షణ కార్డు, ప్రాథమిక చికిత్స, ఉచిత పశువుల బీమా వంటి వివరాలు అందుబాటులో ఉంటాయి.