రాష్ట్ర్లంలో ఆయా ప్రాంతాల్లో తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కోత సమయంలో వున్న నీటిలో మునిగిపోయాయి. ఈ తుపాను ప్రభావంతో తడిసిన, మొలకెత్తిన, పురుగు పట్టిన సరే రైతు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు చేసేలా జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసారు.
తుపాను కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు, ఒక బృందం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, రెండో బృందం తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పాడైపోయిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2,578 ధాన్యం కొనుగోలు కేంద్రాలను 6,643 రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఇప్పటివరకు 4,46,000 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్నారు. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి రైతుల కోసం రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూంలను కూడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రైతులు కాల్ చేయాల్సిన కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు
పౌరసరఫరాలశాఖ కమిషనర్ కార్యాలయం: 18004251903
పశ్చిమగోదావరి: 08812 230448
తూర్పుగోదావరి: 08886613611
కృష్ణా: 7702003571, గుంటూరు: 8331056907