మహిళల భద్రతకు అభయం యాప్

రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అభయ్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రవాణా శాఖ పర్యవేక్షణలో  ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.

దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును తీసుకొచ్చినట్టుగా అభయం యాప్ ని మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ప్రతి ఆటో, క్యాబ్‌లలో నిర్భయంగా ప్రయాణం చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. రూ.138.48 కోట్లు ఖర్చుతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీం కింద రూ .80.09 కోట్లు కేటాయించగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 55.39 కోట్లను ఖర్చు చేయనుంది. 

మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏ మాత్రం రాజీపడేది లేదని, రాష్ట్రంలోని ప్రయాణీకులను తరలించే ప్రైవేట్ వాహనాలకు దశలవారీగా ఐవోటీ బాక్సులను ఏడాది ఫిబ్రవరి నాటికి ఐదు వేల వాహనాలకు ఈ పరికరాలను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.

ఆటోలు,క్యాబ్ లలో ఎక్కే ప్రయాణీకులు తమ మొబైల్స్ లో అభయం యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. వాహనం ఎక్కేముందు వాహనానికి అంటించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది.ఈ వాహనాల్లో ప్రయాణం చేసే వారు ఏదైనా ఇబ్బంది ఎదురైతే వాహనం నెంబర్ ను పంపితే జీపీఎస్ ద్వారా తెలుసుకొనే వీలుంటుంది.