
వ్యవసాయం - Agriculture
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృధ్ది కార్యక్రమాలను శరవేగంగా, ప్రణాళిక బధ్దంగా అమలు చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తోంది. దేశంలో ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించి కరోనా కష్ట కాలంలోనూ నిరాటంకంగా అమలు చేస్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా క్రింద అర్హులైన రైతులు, కౌలుదారు కుటుంబాలకు ప్రతి యేటా 13,500 రూ.ల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటి వరకు వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ప్రభుత్వం రూ. 13,101 కోట్లు ఆన్ లైన్ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేరుగా కంప్యూటర్ బటన్ నొక్కి నిధులను అన్నదాతల అకౌంట్లలోకి జమ చేశారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు పంట నష్టపోతే ఆదుకునేందుకు అన్నదాతల తరుపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల బీమా అమలుకు శ్రీకారం చుట్టడం విశేషం. గతంలో ప్రీమియం చెల్లించిన రైతులకే పంట బీమా వర్తించేది. ప్రీమియం చెల్లించిన రైతులకు కూడ సక్రమంగా గత ప్రభుత్వాలు బీమా మొత్తాన్ని చెల్లించకుండా బకాయిలు పెడుతూ వచ్చాయి. పంటల బీమా కింద 2019 -20 ఖరీఫ్ సీజన్లలో 24.94 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.3072.41 కోట్లు జమ చేసింది. 5.58 లక్షల మంది రైతులకు గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ.716 కోట్ల బకాయిలను కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది.
కరువు, వరదలు లాంటి ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీని ఏళ్ల తరబడి చెల్లించకుండా ఎగవేసిన పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో వుండేది. ఈ పరిస్థితికి చరమం గీతం పాడుతూ ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లోనే పెట్టుబడి రాయితీ చెల్లించే వినూత్న, విప్లవాత్మక విధానానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టి పకడ్బందీగా అమలు చేస్తోంది. 2019 – 20 సంవత్సరంలో వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆయా సీజన్లో రూ. రూ.1,252 కోట్ల పెట్టుబడి రాయితీని అకౌంట్ లో జమ చేసింది.
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిరపోయి రైతులు నష్టపోతున్న సమయంలో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం యేటా ప్రభుత్వం రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ప్రకటించింది. గత రెండేళ్ళలో టమోట, ఉల్లి,మొక్క జొన్న తదితర వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది. వాటిని వినియోగదారులకు సరసమైన ధరలకు అందించటం ద్వారా అటు రైతులకు ఇటు వినియోగదారులకు ప్రభుత్వం ఎంతో ప్రయోజనం కల్పించింది. గతంలో ధరల స్థిరీకరణ కేవలం కాగితాలకే పరిమితమవటం గమనార్హం.
రైతు ముంగిటే నాణ్యమైన కల్తీ లేని విత్తనాలు, ఎరువులు అందించేందుకు జగన్ సర్కార్ ఏర్పాటు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలు దేశానికే మార్గదర్శకంగా మారుతున్నాయి. విత్తనం వేయటం నుండి పండిన పంటను గిట్టుబాటు ధరకు విక్రయించుకునే వరకు ఆర్బీకేలు అన్నదాతలకు సాంకేతిక సలహా భరోసా కేంద్రాలుగా మారాయి.