
కృష్ణాజిల్లా గన్నవరంలో పుట్టి పెరిగిన కొమ్మినేని శ్రీనివాసరావు 1978 లో జర్నలిజంలో ప్రవేశించి నలభై ఏళ్ళ సర్వీసును పూర్తి చేసుకున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎన్.టి.వి, టి.వి5, సాక్షి టీవీలలో ఆయన వివిధ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. తొమ్మిదేళ్ళుగా ఒకే వ్యక్తి పేరు మీద లైవ్ షో ఉండడం ఒక ప్రత్యేకత కాగా, సాక్షి టీవీలో ఒక్కరోజు కూడ మిస్ కాకుండా షో నిర్వహించి రికార్డు నెలకొల్పారు. పలు రాజకీయ పుస్తకాలను ఆయన అందించారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు, తెలంగాణ ప్రజల తీర్పుతో పాటు ఏపిలో శాసనసభ, లోక్ సభలకు ఎన్నికైన సభ్యుల సామాజిక విశ్లేషణతో కూడిన పుస్తకాన్ని రూపొందించారు.
ముఖ్యమైన రచనలు:
రాష్ట్రంలో రాజకీయం
(ఈనాడు పత్రికలో ప్రచురితమైన వ్యాసాలు)
ఆంధ్రా టు అమెరికా , తాజా కలం
(ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వ్యాసాల సంకలనం)
తెలుగు ప్రజాతీర్పు – 1952 నుంచి 2009 వరకు పలు ఎడిషన్ లు
శాసనసభ చర్చల సరళి (మూడు సంపుటాలు)
ప్రాంతీయ ఉద్యమాలు – పదవీ రాజకీయాలు
సంభాషణ చతురుడు – రోషయ్య
రాజకీయ చదరంగంలో ఆంధ్రప్రదేశ్ – ఆంధ్ర నేతల చారిత్రక తప్పిదం
ఆంధ్ర ప్రజాతీర్పు 1952-2014
తెలంగాణ ప్రజాతీర్పు 1952-2014
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం – సూత్రధారులు – పాత్రధారులు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల, లోక్ సభ సభ్యుల సామాజిక విశ్లేషణ