
విద్య - Education
పేద చిన్నారుల విద్యా ప్రగతే లక్ష్యంగా సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మాద్యమం ప్రవేశ పెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పేదల కుటుంబాల్లో హర్షాతిరేకాలు నింపుతూ మేధావుల ప్రశంసలు చూరగొంది. ఆంగ్లం అంతర్జాతీయ భాషగా మారిన నేపథ్యంలో కాన్వెంట్ చదువుల తరహాలో ప్రాథమిక స్థాయి నుంచి ప్రపథమంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం బోధనకు శ్రీకారం చుట్టింది. డబ్బు లేని కారణంగా ఏ తల్లీ తన బిడ్డలను చదివించలేని పరిస్థితి వుండరాదన్న లక్ష్యంతో పాఠశాల విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే అమ్మఒడి అనే విప్లవాత్మక పథకాన్ని ప్రపమథంగా ఈ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సమస్యలతో కునారిల్లుతున్న సర్కార్ బడులకు సకల సౌకర్యాలతో కార్పోరేట్ లుక్ తెచ్చేందుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన “నాడు- నేడు” సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. మొదటి దశలో నాడు- నేడు కింద చేపట్టిన విద్యా సంస్థల రూపు రేఖలు పూర్తిగా మారిపోవటం గమనార్హం. కార్పోరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు టీసీలు తీసుకొని సర్కార్ బడుల్లో ప్రవేశాలు పొందుతుండటతో నాడు-నేడు విజయవంతమైందనటానికి, విద్యాప్రమాణాలు భారీగా మెరుగుపడ్డాయనటానికి ప్రత్యక్ష నిదర్శనాలు. ఈ ప్రభుత్వం ప్రకటించిన జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన,జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ తదితర వినూత్న పథకాలు రాష్ట్రంలో విద్యా ప్రగతి దిశను సమూలంగా మార్చేశాయి. పిల్లలను చదివిస్తున్న ప్రతి తల్లి పేరిట యేటా రూ. 15 వేల ఆర్థిక సాయాన్ని అమ్మ ఒడి పథకం కింద వారి బ్యాంకు అకౌంట్లో ఈ ప్రభుత్వం జమ చేస్తోంది. గతంలో ఇలాంటి కార్యక్రమం లేదు. అమ్మఒడి ద్వారా గతేడాది 43 లక్షల మందికి రూ.6336.45 కోట్లు, ఈ ఏడాది 44.48 లక్షల మంది తల్లులకు రూ.6,673 కోట్లు జమ చేసింది. జగనన్న పౌష్టికాహారం కింద రాష్ట్ర వ్యాప్తంగా 45,484 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 37 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అమలుకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో ఈ మద్యాహ్న భోజన పథకం అద్వానంగా వుండేది. ఈ ప్రభుత్వం ప్రతి రోజూ మెనూ మార్చి పిల్లలకు రుచికరమైన, ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం అందిస్తోంది. కోవిడ్ సమయంలో కూడా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే డ్రై రేషన్ పంపిణీ చేసింది. ఈ పథకానికి గత ప్రభుత్వం ఏటా రూ.520 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. జగన్ ప్రభుత్వం రూ.1,456 కోట్లు ఖర్చు చేయటం గమనార్హం.
విద్యా వాతావరణాన్ని సమూలంగా మార్చివేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం మన బడి నాడు–నేడుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్లు, 55,607 అంగన్వాడీ కేంద్రాల రూపు రేఖలు మూడేళ్లలో మార్చేందుకు రూ. 14 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించి జగన్ ప్రభుత్వం కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే తొలివిడతలో15,715 స్కూళ్లలో నాడు–నేడు కింద గత నవంబర్ 14న పనులు ప్రారంభించింది. సంక్షేమ విద్యాప్రగతి కార్యక్రమాల వల్ల ఈ ఏడాదిలో ప్రభుత్వ స్కూళ్లలో అదనంగా 6 లక్షల మంది విద్యార్థులు చేరటం గమనార్హం.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి బడులు తెరిచే సమయానికి కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫారాలు, స్కూల్ బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు అన్నింటింతో కూడిన కిట్ ని అందించింది.
చిన్నారుల మానసిక వికాసమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం అంగన్ వాడీలను వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూల్ గా మార్చింది. గతంలో అద్వానంగా వున్న అంగన్ వాడీలు.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వున్న 55,607 వైఎస్సార్ ప్రీప్రైమరీ పాఠశాలల్లో చిన్నారులకు సంపూర్ణ పౌష్టికాహారం అందుతోంది.పెద్ద చదువులు చదివే అవకాశం కల్పించాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా డిగ్రీ, మెడిసిన్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనార్టీ, పేద విద్యార్థులకు రూ.4,101 కోట్ల వ్యయంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తోంది. ఈ విద్యార్థులందరి వసతి, భోజనం కోసం ఒక్కొక్కరికి రూ.20 వేల వరకు జగనన్న వసతి దీవెన పథకం కింద ఏటా రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తోంది. వివిధ విద్యాసంక్షేమ పథకాల కింద జగన్ ప్రభుత్వం కేవలం మొదటి ఏడాది కాలంలోనే 1,87,95,804 మంది లబ్ధిదారులకు రూ.24,559.97 కోట్లు ఖర్చు చేయగా గత ప్రభుత్వం ఐదేళ్లలో ఏటా చేసిన వ్యయం(బకాయిలు పోనూ) రూ.3,875.93 కోట్లు మాత్రమే.