నీటి పారుదల - Irrigation

రాష్ట్ర ప్రజల జీవనాడీ పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో జగన్ సర్కార్ నిర్విరామంగా కంకణ బధ్దమై పని చేస్తోంది. గత ప్రభుత్వం పోలవరంను స్వప్రయోజనాల కోసం ఏటీఎంలా మార్చుకోగా ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశామలం చేయాలని అకుంఠిత దీక్షతో భగీరథ యజ్ఞం చేస్తోంది. ఒక వైపు గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుకుంటూ ఎక్కువ నిధులు రాబట్టడం కోసం సీఎం స్వయంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో జరిపిన నిరంతర సమీక్షలు చేసిన విజ్ఞప్తులు సత్పలితాలిస్తున్నాయి. ఒక వైపు పోలవరానికి న్యాయ బధ్దంగా అధిక నిధుల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే మరో వైపు సకాలంలో 2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి పొలాలకు నీరు అందించాలన్న లక్ష్యంతో శరవేగంగా పనులు జరిపిస్తోంది. పోలవరం పనులను రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా జరుపుతోందంటూ కేంద్ర జలవనరుల శాఖ ప్రశంసించటం ఇందుకు నిదర్శనం.

గత సర్కార్ తప్పులను దిద్దుకుంటూ

పోలవరం విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పుల మీద తప్పులను సరిదిద్దుకుంటూ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా నిధులు రాబట్టేందుకు జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆమోదించి నిధులు విడుదల చేయాలని కోరుతూ 2018 జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. దీనిని ప్రామాణికంగా పేర్కొంటూ 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటి పారుదల విభాగం వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి ఆమోదించాలని కేంద్ర జల శక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. 2017-18 లో సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 55 వేల కోట్ల పైమాటే. దీనిని ఆమోదించాలని కోరాల్సిన అప్పటి ప్రభుత్వం ఇందుకు విరుధ్దంగా రూ.20,398.61 కోట్లు ఇస్తే చాలని స్వయంగా లేఖ రాసి ఘోర తప్పిందం చేసింది. 2017-18 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించాల్సిందేనని జగన్ సర్కార్ పట్టుబట్టి కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేయాలని పంకజ్‌కుమార్‌ ఆదేశించారు. ఈ సీజన్‌లో చేయగా మిగిలిన పనులను వచ్చే సీజన్‌లో పూర్తి చేయడానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంలో 2017– 18 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా మండలి (టీఏసీ) సవరించేలా ప్రస్తుత ప్రభుత్వం ప్రభావితం చేసింది. దీంతో రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ (ఆర్‌సీసీ) రూ.47,725.74 కోట్లకు ఆమోదించింది. అన్ని అంశాలు కలుపుకొని ఈ మొత్తం రూ.55,656.87 కోట్లు అవుతుందని ఆర్ సీసీ ధృవీకరించింది. దీని ప్రకారం నిధులు విడుదల చేసి పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు సహకారం అందించాలని సీఎం జగన్ ప్రధానమంత్రికి జలవనరుల శాఖ మంత్రికి,ఆర్థిక శాఖ మంత్రికి అన్ని వివరాలను తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం డిమాండ్ పూర్తిగా న్యాయబధ్దమేనని, పోలవరం పూర్తి కావాలంటే సవరించిన అంచనాల ప్రకారం నిధులు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖతోనే ఆర్థిక శాఖ ద్వారా చెప్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం కృతకృత్యమయ్యింది. జాతీయ ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం.. నీటిపారుదల వ్యయం, నీటి సరఫరా వ్యయం వేర్వేరు కాదని.. రెండూ ఒకటేనని.. ఆ మేరకే పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వాదనను సీడబ్ల్యూసీ చైర్మన్‌ హెచ్‌కే హల్దార్‌ బలపర్చటం రాష్ట్ర ప్రభుత్వ వాదన పటిమకు నిదర్శనం
అన్ని ప్రాంతాలపై సమాన దృష్టితో పోలవరం పూర్తి చేయటంతో పాటు అన్ని ప్రాంతాల్లో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టి ప్రాజెక్టులు పూర్తి చేసి నీరు అందించాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ ప్రాజెక్టు పనులకు ప్రాధాన్యం ఇస్తోంది.

వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా ప్రస్తుత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీనిపై వున్న వివాదాలను పరిష్కరించుకునేందుకు చర్చల కోసం ఒడిస్సా ప్రభుత్వంతో రాష్ట్రం సంప్రదింపులు ప్రారంభించింది.

జూలై 31 నాటికి నెల్లూరు బ్యారేజీ నిర్మాణం

నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జూలై 31 నాటికి పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చక చకా చర్యలు తీసుకొంటుంది. అవుకు టన్నెల్‌లో రెండువైపుల నుంచి పనులు చేయిస్తుంది.

వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్ –1 పూర్తిగా సిద్ధమైంది. టన్నెల్‌ –1 హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు కూడా దాదాపుగా పూర్తియ్యాయి. టన్నెల్‌ –2 పనులు వేగంగా జరిపిస్తోంది. ఈ పనులు యుధ్ధ ప్రాతపదికన సాగుతున్నాయి.

వంశధార స్టేజ్‌ 2, ఫేజ్‌ 2 పనులను ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం చేపడుతుంది. . వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు సత్వరమే పూర్తి చేసే దిశంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
కరువు ప్రాంతమైన రాయలసీమ సస్యశామలం చేసేందుకు చర్యలు చేపట్టింది. కరువు నివారణ ప్రాజెక్టులు.. గోదావరి కృష్ణా సలైనటీ మిటిగేషన్‌, వాటర్‌ సెక్యూరిటీ ప్రాజెక్టులు.. పల్నాడు ప్రాంత కరువు నివారణా ప్రాజెక్టులు..ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

సంబంధిత సమాచారం

ప్రాజెక్టుల భద్రతకు ప్రత్యేక చర్యలు

ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణ పరిస్థితులను సరిదిద్దాలినిర్వహణకు తగినంత సిబ్బంది లేకపోతే నియమించండిరాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోలేదుదీని వల్ల ముప్పు ఏర్పడే పరిస్థితులు...

జల వివాదాల పరిష్కార దిశగా ప్రభుత్వం

నీటి వివాదాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి9న భువనేశ్వర్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ఉన్నత స్థాయి సమీక్ష దశాబ్దాలుగా ఒడిశాతో నెలకొన్న జల వివాదాలను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు....

సీలేరులో మరో విద్యుత్‌ ప్రాజెక్ట్‌

410 హెక్టార్లలో ప్రాజెక్టు నెలకొల్పేలా డీపీఆర్‌ సిద్ధంఎగువ సీలేరు వద్ద పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఆదేశంరివర్స్‌ పంపింగ్‌ ద్వారా 1,350 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో మరో మైలురాయిని అధిగమించేందుకు రాష్ట్ర...

పోలవరం ప్రాజెక్టు అంతర్రాష్ట్ర సమస్యలపై ముందడుగు

3 రాష్ట్రాల జలవనరుల అధికారులతో కేంద్రం సమావేశం కరకట్టల నిర్మాణానికి ప్రజాభిప్రాయం సేకరించాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు ఆదేశం పోలవరం పనులపై స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ ఎత్తేసేందుకు పరిశీలిస్తామన్న కేంద్రం 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేసేలా ఏపీ అడుగులు వేస్తోందన్న పీపీఏ సీఈవో  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంతర్‌రాష్ట్ర...

వీడియోలు

Advertisment