
పరిశ్రమలు - ఉపాధి - Industries and employment
యువతకు ఉపాధి కల్పన, పారిశ్రామిక ప్రగతి లక్ష్యంగా జగన్ సర్కార్ అత్యంత దూరదృష్టితో మానవ వనరుల నైపుణ్యాన్ని పెంచేలా ప్రణాళిక బధ్దంగా ముందుకెళ్తోంది. ప్రపంచమే గ్లోబల్ విలేజ్ గా మారి ఉద్యోగాలకు తీవ్ర పోటి నెలకొన్న నేపథ్యంలో దీన్ని అధిగమించి యువత స్థిరపడాలంటే ఆధునిక ,శాస్త్రీయ సాంకేతిక నైపుణ్యతలు తప్పనిసరి. అందుకే ఈ ప్రభుత్వం యువతకు అత్యాధునిక సాంకేతిక శిక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ పట్నంలో హైఎండ్ స్కిల్స్ యూనివర్సిటీ, తిరుపతిలో స్కిల్‌డెవలప్‌మెంట్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో ఒక్కోటి చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా యువతకు సాంకేతిక నైపుణ్యాల శిక్షణ ఇప్పిస్తోంది. ఇలా శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు కూడ కల్పిస్తోంది. ఇందు కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అవగాహాన ఒప్పందాలు కూడ కుదుర్చుకుంది. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి స్కిల్స్‌ను ఇక్కడ నేర్పిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కాగితాలకే పరిమితమైన స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందు చూపుతో అత్యంత క్రియాశీలకంగా శరవేగంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం గమనార్హం. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం దిశగా ప్రభుత్వం కడప స్టీల్ కార్పోరేషన్ ఏర్పాటు చేసింది.
ఆదర్శ పారిశ్రామిక విధానం
దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలు ఆకట్టుకొని పెట్టుబడులను పెట్టేలా ప్రోత్సహించేందుకు ఉత్తమ రాయితీలతో కూడిన నూతన పారిశ్రామిక పాలసీని ఈ ప్రభుత్వం రూపొందించింది. గత ప్రభుత్వంలో ఒక విధానం అంటూ లేకుండా నచ్చిన వారికి నచ్చినట్లు ప్రోత్సహాకాలు ఇచ్చే పధ్దతికి స్వస్తి చెప్పి పక్కా విధి విధానాలతో రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం ఆకర్షించటం వల్లే ఇంటెలిజెంట్ సెజ్, అదానీ డేటా సెంటర్, ఏటీసీ టైర్ల తదితర సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయి.
రూ.2 లక్షల కోట్లతో పెట్రో కారిడార్ ఏర్పాటుకు మార్గం సుగమం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ వల్ల రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ పెట్రోలియం రిఫైనరీ యూనిట్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. పెట్రో కారిడార్ ద్వారా రూ.రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో 50 లక్షల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం పెట్రో కెమికల్ కారిడార్‌పై కేంద్రం వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రానికి ఉపయోగపడేలా తగ్గిన కార్పొరేట్ ట్యాక్స్, వడ్డీరేట్లను పరిగణలోకి తీసుకుంటూ కొత్త ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసే బాధ్యతను ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఎస్బీఐ క్యాప్‌లకు అప్పగించారు.
ఇథనాల్ తయారీ యూనిట్‌పై సానుకూలం
దీంతో పాటు రాష్ట్రంలో ఇథనాల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆసక్తిని వ్యక్తం చేసింది. చక్కెర కర్మాగారాల ద్వారా వచ్చే మొలాసిస్‌ను ఇథనాల్‌గా మార్చడానికి ప్రత్యేకంగా రూ.1,000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటుకు కూడా కేంద్రం సానుకూలత వ్యక్తం చేయటం గమనార్హం.
ఇటీవల జరిగిన ఎస్సైపీపీ సమావేశంలో రూ.16వేల కోట్ల పెట్టుబడులతో 14 పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం లభించింది. నెల్లూరులో జిందాల్ స్టీల్స్, ఆత్మకూరులో సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమ ఏర్పాటుతో పాటు గ్రీన్‌టెక్ పరిశ్రమ విస్తరణ, గుంటూరులో శ్రీచక్ర సిమెంట్స్, చిత్తూరులో టెక్స్ టైల్ పరిశ్రమ, విన్‌టెక్, విశాఖజిల్లా అచ్యుతాపురంలో సెయింట్ గోబిన్, గోల్డ్ ప్లస్ గ్లాస్ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనల్లో ఉండటం గమనార్హం.
ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఏపీలో పరిశ్రమల కోసం కొత్త ‘కాన్సెప్ట్ సిటీ’ల ఏర్పాటు పనులు కూడ జరుగుతున్నాయి. విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం లాంటి పట్టణాలకు అనుబంధంగా ఈ కాన్సెప్ట్ సిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.