మరిన్ని శాఖలు - More Departments

రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులో లేవని బాధపడే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు రూపకల్పన చేసింది. దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలను అందుబాటులోకి తెచ్చి అర్జీ పెట్టుకున్న 72 గంటలోనే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది.

రాష్ట్రంలో వివిధ సామాజిక వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గిరిజనులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థితిలో నిలిపేందుకు వారి ప్రత్యేక సంస్కృతిని, హక్కుల్ని కాపాడటానికి జగన్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. గిరిజనులకు రక్షణగా ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ని ఏర్పాటు చేసింది. వీరు తయారు చేసే ఉత్పత్తుల అమ్మకాలకు గిరిజన కో–ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ (జీసీసీ) ద్వారా ప్రోత్సాహిస్తోంది. గిరిజన విద్యార్థులకు ఉన్నత స్థానంలో మెరుగైన విద్యను అందించేందుకు ప్రత్యేక గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాల, కురుపాంలో రూ.153 కోట్లతో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గిరిజనులకు 3 లక్షల ఎకరాలకు పట్టాల భూములను ప్రభుత్వం పంపిణీ చేసింది. అటవీ భూములపై హక్కులు కల్పించి 1,30,679 ఎకరాలకు సంబంధించి 55,513 ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేస్తూ పోడు వ్యవసాయాన్ని నమ్ముకున్న దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతుల స్వప్నం సాకారం చేసింది. వ్యవసాయ సంబంధిత అవసరాల కోసం ట్రైకార్‌ స్పెషల్‌ ప్రాజెక్టుల్లో భాగంగా 23,923 మంది గిరిజనులకు రూ.11.73 కోట్లతో అందుకు కావాల్సిన యంత్రపరికరాలను ప్రభుత్వం అందిస్తోంది.

నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంచే స్కిల్ డెవలప్ మెంట్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి 2021-22 ఏడాదికి 10,143 ఉద్యోగాలను ప్రకటించారు. ఇందుకు సంబంధించి జాబ్‌ క్యాలెండర్‌ను జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ఆధారంగా అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియమాలు వుంటాయని ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్రంలో దళారీ వ్యవస్థ లేకుండా ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ప్రస్తుత ప్రభుత్వం 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేసింది.

గత ప్రభుత్వంలో పరిమిత ఫించన్లు,మరణిస్తే కాని మరొకరికి పింఛను ఇవ్వని దుస్థితి, కేవలం 75 రూపాయిల కోసం ప్రభుత్వాధికారుల చుట్టూ పడిగాపులు పడే పరిస్థితులను జగన్ ప్రభుత్వం మార్చేసింది. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, మత్స్యకారులు, గీతకార్మికులు, సాంప్రదాయ చర్మకారులు, డప్పు కళాకారులు, కళాకారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. ప్రస్తుతం దీని ద్వారా రాష్ట్రంలో 61.46 లక్షల మంది లబ్ధి పొందుతుండగా అదనంగా ధరఖాస్తు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకు మరింతగా పెరుగుతోంది.

గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు పన్నులు, ఛలాన్ల రూపంలో భారీగా వడ్డింపులు ఉండేవి. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సొంతంగా ఆటో,క్యాబ్‌ నడుపుకునే డ్రైవర్లకు వైఎస్ఆర్ వాహాన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేల చొప్పున సాయం లభిస్తోంది. 2019-20 సంవత్సరంలో 2,36,334 మందికి, 2020–21లో 2,73,985 మందికి ప్రయోజనం చేకూరింది. ఈ ఏడాది మూడో విడతగా 2,48,468 మంది లభ్ధిదారులకు రూ.248.47 కోట్లు అందించారు. దీనితో ఇప్పటి వరకు మూడు విడతలు కలపి అక్షరాలా రూ.759 కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జ‌మ చేసింది.

అర్హత గల ప్రతి చేనేత కుటుంబానికి నేతన్న నేస్తం పథకం ద్వారా రూ.24 వేల సాయం అందిస్తోంది.

కరోనా కష్ట కాలంలో పనులను పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్న పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం ఇంటి వద్దే అందించేందుకు 9,260 వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందు కోసం ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తోంది.

సంబంధిత సమాచారం

తెలంగాణ మీడియా అకాడమీని సందర్శించిన కొమ్మినేని

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరబాద్ లోని మీడియా అకాడమీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అకాడమీల్లో జర్నలిస్టుల...

ఉద్యోగులకు ఈఎంఐ పధ్దతిలో ఈ–స్కూటర్లు

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌(ఈ–స్కూటర్‌)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రతి రోజూ కార్యాలయానికి వెళ్లి రావడం, ఇతర పనుల మీద...

రేషన్‌ డోర్‌ డెలివరీకి ప్రశంసలు

వలంటీర్ల వ్యవస్థ, ఇంటింటికీ పంపిణీని ప్రశంసించిన కేంద్ర బృందం అన్నమయ్య జిల్లాలో రేషన్‌ షాపుల పరిశీలనలబ్ధిదారులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడి జాతీయ ఆహార భద్రత చట్టం అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పౌర సరఫరాల...

వీడియోలు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

పోలవరం ప్రాజెక్టును సందర్శించి మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు. https://www.youtube.com/watch?v=rqlEoh-XeoA

జర్నలిస్టుల వృత్తి పరమైన మానసిక ఒత్తిడిలపై ప్రెస్ క్లబ్ లో అవగాహన సదస్సు

జర్నలిస్టుల వృత్తి పరమైన మానసిక ఒత్తిడిలపై ప్రెస్ క్లబ్ లో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ముఖ్య అతిధిగా ఏపీ ప్రభుత్వ సలహాదారులు(కమ్యూనికేషన్స్) జీవీడీ...

పధకాల వివరాలు

Advertisment