
మహిళా సంక్షేమం - Women Welfare
మహిళా సంక్షేమం, మహిళా సాధికారతకు జగన్ ప్రభుత్వం అన్నింటా ఎనలేని ప్రాధాన్యం కల్పించింది. మహిళా ఒక కుటుంబంలో విద్యావంతురాలైతే ఆ కుటుంబంలోని అందరూ విజ్ఞానవంతులవుతారన్న పెద్దల మాటను తూచ పాటిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారు. బాలికలు, మహిళల కోసం ప్రపథమంగా ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టడం వారి ఆర్థిక, సామాజిక అభివృధ్ది పట్ల ఈ ప్రభుత్వానికి వున్న శ్రధ్ధకు నిదర్శనం. మహిళలను వ్యాపార సామ్రాజ్ఞులుగా మార్చాలన్న సమున్నత ఆశయంతో వారికి శిక్షణ సాంకేతిక సహకారం అందించేందుకు ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐటీసీ, హిందుస్థాన్ యునీలివర్, అమూల్ తదితర సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకోవటం ద్వారా మహిళలను ప్రగతి బాట పట్టిస్తోంది.
45 -60 ఏళ్ళ లోపు మహిళ ఆర్థిక స్వావలంబన కోసం వ్యాపారం చేసుకునేందుకు వీలుగా అర్పులైన ప్రతి ఒక్కరికి నాలుగేళ్ళలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందించే వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రకటించిన ఈ ప్రభుత్వం రెండేళ్ళలో అక్క చెల్లెమ్మలకు రూ.8,943 కోట్లను అందజేసింది.
ద్వాక్రా అక్కా,చెల్లెమ్మలు వ్యాపారాలు చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించటం కోసం ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. వారి తరుపున వడ్డీని బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లిస్తోంది. 60 ఏళ్లు దాటిన వారికి వెంటనే పెన్షన్ ఇస్తోంది.గతంలో రూ.1,000 వున్న పెన్షన్ ని రూ.2,250 లకు పెంచింది. వచ్చే జనవరిలో పెన్షన్ ని రూ.2,500 లకు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది.
మహిళలను కుటుంబ సారథులుగా చేయాలని ఈ ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వీలయినంత ఎక్కువగా మహిళల పేరిటే అందిస్తోంది. రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో ఇళ్లు లేని వారు ఉండరాదని ప్రతి ఒక్కరికి గూడు కల్పించాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం 30 లక్షల ఇళ్ళు నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే సుమారు 28 లక్షల మందికి ఇళ్ళ స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. మొదటి దశలో 15.60 లక్షల ఇళ్ళ నిర్మాణానికి భూమి పూజలు కూడ పూర్తి చేసింది. సుమారు రూ.50 వేల కోట్లతో చేపడుతున్న పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం మహిళల పేరిటే చేపట్టడం గమనార్హం.
అన్నింటా సగం.
దేశ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ, ఎప్పుడూ లేని విధంగా నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకే కేటాయిస్తూ జగన్ ప్రభుత్వం ఏకంగా చట్టమే చేసింది. దీంతో ఆలయ పాలక మండళ్లు, కార్పొరేషన్లు, మార్కెట్ యార్డులో సభ్యుల్లో సగం మంది పైగా మహిళలు స్థానం పొందారు. రాష్ట్ర కేబినెట్లో ఉప ముఖ్యమంత్రితో పాటు హోం మంత్రిగా కూడ మహిళ వుండటం గమనార్హం. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా ప్రత్యేక స్థానంలో నిలిచింది.